ETV Bharat / bharat

పెళ్లికి హాజరై వస్తుండగా ప్రమాదం- ఏడుగురు మృతి

ఆగి ఉన్న బస్సును మరో బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది.

bus accident in up
యూపీలో బస్సు ప్రమాదం
author img

By

Published : Jul 19, 2021, 8:52 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ సంభల్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. ఆగ్రా- చందౌసీ రహదారిపై బాహ్​జోయ్​ పోలీస్​ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.

bus accident in up
ప్రమాదానికి గురైన బస్సు

ఓ వివాహ వేడుకకు హాజరైన ప్రయాణికులతో వస్తున్న ఓ ప్రైవేట్​ బస్సు టైరు పంక్చర్​ అయింది. దీంతో లహరావన్​ గ్రామం వద్ద దానిని నిలిపి ఉంచారు. ఆగి ఉన్న ఆ బస్సును మరో బస్సు ఢీకొనగా ప్రమాదం జరిగిందని జిల్లా ఎస్పీ చక్రేశ్​ మిశ్రా తెలిపారు.

up bus accident
ఘటనాస్థలిలో పోలీసులు

మృతులను విర్పుల్​(60), హప్పు(35), ఛోటే(40), రాకేశ్​(30), అభయ్​(18), వినీత్​(30), భూరే(25)గా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించామని చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించామని తెలిపారు.

ఇదీ చూడండి: భీకర వర్షాలకు ముగ్గురు మృతి- నలుగురు గల్లంతు

ఇదీ చూడండి: కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.