ETV Bharat / bharat

'పీ305' దుర్ఘటనలో 60కి పెరిగిన మృతులు

author img

By

Published : May 22, 2021, 6:42 AM IST

తౌక్టే తుపాను కారణంగా అరేబియా సముద్రంలో ఐదు రోజుల క్రితం గల్లంతైన భారీ నౌక పీ-305లో చిక్కుకుని మృతి చెందిన వారి సంఖ్య 60కి చేరింది. గల్లంతైన మరో 15 మంది కోసం గాలింపు ముమ్మరం చేశారు అధికారులు.

P305, Boat Accident
బార్జ్​ పీ305, నౌక ప్రమాదం

తౌక్టే తుపాను ధాటికి ఐదు రోజుల క్రితం అరేబియా సముద్రంలో 'బార్జ్​ పీ305' నౌక మునిగిపోయిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 60కి పెరిగింది. సహాయక చర్యలు కొనసాగిస్తున్న నావికా, తీర రక్షణ దళాలు.. శుక్రవారం మరో 11 మృతదేహాలను కనుగొన్నాయి. ఇంకో 15 మంది జాడ తెలియాల్సి ఉంది.

261 మందితో ప్రయాణిస్తున్న 'బార్జ్​ పీ305' నౌక గత సోమవారం నీట మునిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 186 మందిని రక్షించారు అధికారులు.

ఇదీ చదవండి: సొరంగం కూలి నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.