ఆక్సిజన్ కొరత కరోనా రోగుల పాలిట మృత్యుపాశమైంది. మధ్యప్రదేశ్ భోపాల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆక్సిజన్ లేమితో ఆరుగురు కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల ఆక్సిజన్‌కు డిమాండ్ అధికమైంది. ఇందుకు తగ్గట్లు సరఫరా లేకపోవడం ప్రస్తుతం ఆందోళకరంగా మారింది.