ETV Bharat / bharat

ఆక్సిజన్​ అందక 8 మంది రోగులు మృతి

ఆక్సిజన్​ కొరతతో రోగులు మృతి చెందుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. పంజాబ్​ అమృత్​సర్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాణవాయువు సరఫరా నిలిచి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్​ వాల్వ్​ ఆఫ్​ చేయటం ద్వారా మహారాష్ట్ర బీద్​ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు రోగులు చనిపోయారు. మరోవైపు.. దిల్లీలోని రెండు కీలక ఆసుపత్రుల్లో ఆక్సిజన్​ కొరత కారణంగా పడకలను 50 శాతం మేర తగ్గించటం ఆందోళన కలిగిస్తోంది.

patients died due to lack of oxygen
ఆక్సిజన్​ కొరత
author img

By

Published : Apr 24, 2021, 6:05 PM IST

దేశంలో ఆక్సిజన్​ కొరత తీవ్రంగా వేధిస్తోంది. దిల్లీ సహా పలు నగరాల్లో కొరత ఎక్కువగా ఉంది. పంజాబ్​ అమృత్​సర్​లోని నీల్​కాంత్​ ప్రైవేటు ఆసుపత్రిలో ఆక్సిజన్​ సరఫరా నిలిచి ఆరుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఐదుగురు కరోనా రోగులు ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆరుగురు చనిపోయిన తర్వాత.. ఐదు ఆక్సిజన్​ సిలిండర్లను ఆసుపత్రికి పంపింనట్లు తెలిపాయి.

ఈ ఘటన నేపథ్యంలో అధికారులతో సమావేశమయ్యారు రాష్ట్ర మంత్రి ఓం ప్రకాశ్​ సోనీ. ముగ్గురు సభ్యులతో కమిటీ వేసినట్లు తెలిపారు. కారకులపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ప్రజలను కోరారు.

వాల్వ్​ ఆఫ్​ చేయటంతో ఇద్దరు మృతి

మహారాష్ట్ర బీద్​ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అమానవీయ ఘటన జరిగింది. రోగులకు అమర్చిన ఆక్సిజన్​ సిలిండర్ల వాల్వ్​ను గుర్తు తెలియని వ్యక్తి ఆఫ్​ చేయటం వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలోని వార్డు 7లో ఈ ఘటన జరిగినట్లు మృతుల బంధువులు తెలిపారు. అయితే.. ఆసుపత్రిలో ఒక్కరే ఆక్సిజిన్​పై చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలపగా.. బందువులు మాత్రం ఇద్దరూ ఆక్సిజన్​పై ఉన్నట్లు పేర్కొన్నారు. 'ఆక్సిజన్​ సరఫరా చేసే వాల్వ్​​ ఆఫ్​ చేసినట్లు ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు. ఎవరైనా దానిని ఆఫ్​ చేసి ఉండొచ్చు. 'అని వైద్యుడు సుఖ్​దేవ్​ రాథోడ్​ తెలిపారు.

రెండు ఆసుపత్రుల్లో పడకల తగ్గింపు..

ఆక్సిజన్​ కొరత కారణంగా దిల్లీలోని రాజీవ్​గాంధీ సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రి, గురు టెగ్​ బహదుర్​ ఆసుపత్రుల్లో కరోనా పడకలను తగ్గించాయి. రాజీవ్​గాంధీ ఆసుపత్రిలో 650 పడకలు ఉండగా.. ప్రస్తుతం వాటిని 350కి తగ్గించారు. అలాగే.. బహదూర్​ ఆసుపత్రిలో 1500 పడకలు ఉండగా ఇప్పుడు 700 మాత్రమే ఉన్నాయి. అవీ పూర్తిగా నిండిపోయాయి. ఆక్సిజన్​ కొరత కారణంగానే పడకలను తగ్గించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: ఆక్సిజన్ కొరతతో 25 మంది రోగులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.