ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి, 18 మందికి గాయాలు - రోడ్డు ప్రమాదాలు

Road Accident: నూతన సంవత్సరం వేళ ఝార్ఖండ్​లో విషాద ఘటన వెలుగు చూసింది. సొంతూరుకు తిరిగి వస్తున్న కూలీలు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 18 మంది గాయపడ్డారు.

Road Accident
ఆరుగురు మృతి, 18 మందికి గాయాలు
author img

By

Published : Jan 1, 2022, 1:27 AM IST

Updated : Jan 1, 2022, 2:32 AM IST

Road Accident: ఝార్ఖండ్​లోని పాలము జిల్లా హరిహరగంజ్​లో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. 18 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇదీ జరిగింది..

పాలము జిల్లా పంకీ గ్రామానికి చెందిన కూలీలు శుక్రవారం సాయంత్రం.. బిహార్​లోని సిహుడీ గ్రామం నుంచి తిరిగివస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వ్యాన్​ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మరోవైపు గాయపడిన 18 మందిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి : 14 ఏళ్ల దివ్యాంగురాలిపై గ్యాంగ్ రేప్.. 60 ఏళ్ల వృద్ధుడు కూడా...

Last Updated : Jan 1, 2022, 2:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.