బంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బారుయిపుర్ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి.. బొలెరో బోల్తా పడి.. ఆరుగురు మృతి చెందారు. మరో 17 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించిన అధికారులు.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
ప్రమాద సమయంలో బొలెరోలో 27 మంది ఉన్నట్లు అధికారులు చెప్పారు. వీరంతా కూలీ పనుల కోసం తమిళనాడు వెళ్తుండగా.. ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. అతివేగంతో అదుపు తప్పి బొలేరో.. చెట్టును ఢీకొట్టినట్లు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. బొలెరో డ్రైవర్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం.. ఆపై హత్య!