ETV Bharat / bharat

'మహా'పై కరోనా పంజా- కొత్తగా 57వేల కేసులు

మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కొత్తగా 57 వేల మందికి వైరస్​ సోకింది. దిల్లీ, తమిళనాడు, ఛత్తీస్​గఢ్​లోనూ వైరస్​ వ్యాప్తి ఆందోళనకరంగా మారింది.

covid in maharashtra
కొవిడ్ పంజా: మహారాష్ట్రలో కొత్తగా 58వేల కేసులు
author img

By

Published : Apr 4, 2021, 11:40 PM IST

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో.. సగానికిపైగా కేసులు మహారాష్ట్రలోనే నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో కొత్తగా 57,074 మందికి వైరస్​ సోకింది. 222 మంది వైరస్​కు బలయ్యారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 30లక్షలు దాటింది.

నగరాల్లో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. ముంబయిలో కొత్తగా 11,163 మందికి పాజిటివ్​గా తేలింది. 25 మంది మృతిచెందారు. పుణెలో 12,494 కొత్త కేసులు నమోదయ్యాయి. 64 మంది వైరస్​ కారణంగా ప్రాణాలు విడిచారు.

నాగ్​పుర్​ ఆసుపత్రిలో కొవిడ్ రోగులకు పడకలు సరిపోక ఒకే బెడ్​పైన ఇద్దరు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్​గా మారింది. అయితే దీనిపై స్పందించిన నాగ్​పుర్ జీఎంసీ ఆసుపత్రి సూపరింటెండెంట్.. ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​ నుంచి రోగులు తమ ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు.

covid patients
ఒకే పడకపై ఇద్దరు రోగులు
covid patients
పడకలు సరిపోక ఇబ్బందిపడుతున్న రోగులు

వారాంతపు లాక్​డౌన్..

కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న వేళ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వారాంతాల్లో లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల మధ్య ఆంక్షలు విధించనున్నారు.

వారాంతపు లాక్​డౌన్​తోపాటు సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి కర్ఫ్యూ అమలు కానుంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. మాల్స్‌, బార్లు, రెస్టారెంట్లను మూసి వేయనున్నారు. హోటళ్లలో పార్సిల్‌ సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితోనే పని చేయనున్నాయి.

రాజధానిలో..

దిల్లీలో కేసులు స్థిరంగా పెరుగుతున్నాయి. ఆదివారం 4,033 మందికి వైరస్​ సోకగా 21 మంది మృతిచెందారు.

తమిళనాడు, పంజాబ్​లో..

తమిళనాడులో 3,581 కొత్త కేసులు నమోదయ్యాయి. 14 మంది వైరస్​ కారణంగా మరణించారు. పంజాబ్​లో 3,019 మందికి పాజిటివ్​గా తేలింది. 51 మంది చనిపోయారు.

ఇదీ చదవండి:తల్లి టీవీ ఆఫ్​ చేసిందని కొడుకు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.