56 Old Man Completed two Masters Degrees : మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌కు చెందిన రాజ్‌కరణ్ బారువా (56).. రూ.5 వేల జీతానికి రాత్రంతా సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. పగలు ఇళ్లలోనూ పనిచేస్తారీయన. ఇలా చాలామంది చేస్తూ ఉండవచ్చు. దాదాపు రిటైర్మెంట్ వయసుకు దగ్గరైనా చదువుపై ఇష్టం మాత్రం రాజ్‌కరణ్ బారువాకు తగ్గలేదు.
1996లోనే పురాతత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన రాజ్‌కరణ్ గణితశాస్త్రంలో ఆ ఘనత సాధించాలన్నది తీరని కోరికగా ఉండేది. బతుకు పోరులో జీవితం ఎన్నో పరీక్షలు పెట్టినా మనసులోని ఆకాంక్షను అలాగే సజీవంగా ఉంచుకొన్నారు రాజ్‌కరణ్. 23 విఫల యత్నాల తర్వాత ఇటీవల డబుల్ పీజీ పూర్తి చేశారు. జబల్‌పుర్‌లోని రాణీ దుర్గావతి యూనివర్సిటీ నుంచి ఈ ఏడాది తన రెండో మాస్టర్ డిగ్రీ ఎమ్మెస్సీ ఇన్ మ్యాథ్స్‌ను ఆయన సాధించారు. అవివాహితుడిగా మిగిలిపోవడాన్ని గురించి స్పందిస్తూ.. 'నేను నా కలలను పెళ్లాడాను' అని చెప్పారు.
"ఈ ప్రయత్నంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. రాత్రిళ్లు యజమానులు కేక వేసినపుడు నేను మెట్లపై కూర్చొని చదువుకోవడాన్ని చూసి కొంతమంది కటువుగా మాట్లాడేవారు. నా రెండో ప్రయత్నంలో ఒక సబ్జెక్టు మినహా మిగతా అన్నింటిలో వరుసగా పరీక్షలు తప్పుతూ వచ్చాను. చివరకు సాధించాను. నా యజమానులు చదువు విషయంలో వారి పిల్లలపై కేకలు వేయడాన్ని చూశా. ఏ సదుపాయాలు లేని నేనే సాధించినపుడు.. వారెందుకు సాధించలేరు?".
-రాజ్‌కరణ్ బారువా, సెక్యూరిటీ గార్డ్
టీచర్లకు కేరాఫ్ అడ్రస్‌గా ఆ గ్రామం..
ఒకప్పుడు అది విద్యావంతులే లేని గ్రామం.. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఓ ఉపాధ్యాయుడు దర్శనమిస్తారు! ఓ స్వామీజీ తీసుకున్న నిర్ణయంతో అక్కడ అనూహ్య మార్పులు వచ్చాయి. టీచర్లకు కేరాఫ్‌గా ఆ గ్రామం మారిపోయింది. రాష్ట్రంలోనే ఎక్కువ మంది టీచర్లు ఉన్న గ్రామంగా రికార్డుకెక్కింది. కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని సావదత్తి తాలుకాలోని ఇంచాల్ ప్రతి అంగుళానికీ ఓ టీచర్ కనిపిస్తారని చెబుతుంటారు. ఈ గ్రామానికి చెందిన 500 మందికి పైగా టీచర్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. పూర్తి వార్తను చదవడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఆస్ట్రేలియాలో ఆంధ్రా చాయ్‌వాలా.. చదువు మానేసి.. టీతో రూ.5 కోట్ల ఆదాయం!
గుడిలో ముస్లిం దివ్యాంగురాలి పాఠాలు.. ఎర్రకోట సాక్షిగా పేద పిల్లలకు కానిస్టేబుల్ విద్యాదానం