పశువుల కోసం గడ్డి తీసుకొచ్చేందుకు అడవికి వెళ్లిన 55 ఏళ్ల దళిత మహిళపై (Noida Gang Rape victim) నలుగురు యువకులు.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తర్ప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. (Noida news)
విషమ పరిస్థితుల్లో ఇంటికి చేరుకున్న బాధిత మహిళ.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. బాధిత మహిళ భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. (Noida news today)
మత్తులో నిందితులు
పశువుల కోసం గడ్డి తీసుకొచ్చేందుకు మహిళ అడవిలోకి వెళ్లిందని, ఆ సమయంలో నిందితుల్లో ఒకరు అక్కడే పశువులకు కాపలా కాస్తున్నాడని బాధితురాలి భర్త ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వ్యక్తి గంజాయి తీసుకున్నాడని చెప్పారు.
ఘటన సమయంలో ప్రధాన నిందితుడు మత్తులోనే ఉన్నారని డీసీపీ వృందా శుక్లా తెలిపారు. ఘటనలో మిగిలిన ముగ్గురి పాత్ర గురించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వీరిని అరెస్టు చేయడం కోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దోషులను విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
మాయావతి ఫైర్
దళిత మహిళ అత్యాచార ఘటనపై యూపీ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తీవ్రంగా స్పందించారు. తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటన సమాజానికి సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: