ETV Bharat / bharat

పాఠశాల విద్యలో ఆ రాష్ట్రాలకు ఏ++ గ్రేడింగ్​ - కేంద్ర విద్యాశాఖ ప్రతిభా సూచీలు

పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2019-2020 విద్యాసంవత్సరానికి గాను ప్రతిభా గ్రేడింగ్​ సూచీని విడుదల చేసింది. ఈ జాబితాలో ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సత్తా చాటాయి.

Performance Grading Index
ప్రతిభా సూచీ
author img

By

Published : Jun 6, 2021, 10:48 PM IST

2019-20 విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభా గ్రేడింగ్‌ సూచీలో అయిదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సత్తా చాటాయి. కేంద్ర విద్యాశాఖ ఆదివారం ఈ సూచీని ప్రకటించింది. దీనిలో పంజాబ్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన చండీగఢ్‌, అండమాన్ నికోబార్‌లు ఏ-ప్లస్‌-ప్లస్‌ గ్రేడ్‌ను సంపాదించాయి.

దిల్లీ, గుజరాత్‌, హరియాణా, రాజస్థాన్‌, పుదుచ్చేరి, దాద్రానగర్‌ హవేలీకి ఏ-ప్లస్‌ గ్రేడ్‌ వచ్చింది. విద్యావ్యవస్థ పాలనా నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ సహా 7 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పనితీరును 20శాతం మెరుగుపర్చుకున్నాయి. మరో 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 10శాతం పురోగతి సాధించాయి. 70 అంశాల ఆధారంగా ఈ గ్రేడింగ్‌ను నిర్ణయించారు.

మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఈ సూచీలో అత్యధిక పాయింట్లతో పంజాబ్​ మొదటి స్థానంలో నిలువగా.. బిహార్​, మేఘాలయాలు తక్కువ పాయింట్లను నమోదు చేశాయి.

ఇదీ చూడండి: ఆ మామిడి పండ్లు తినాలంటే ఆస్తులమ్ముకోవాలి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.