కర్ణాటకలోని బళ్లారి, విజయనగర జిల్లాలో గత రెండు నెలల్లోనే 48 బాల్య వివాహాలు జరిగాయి. కరోనాతో లాక్డౌన్ కారణంగా ఈ ఘటనలు మరింతగా పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
ఏప్రిల్లో 36 బాల్య వివాహాలు జరగగా.. మేలో 12 జరిగాయని అధికార వర్గాలు తెలిపాయి. మొత్తంగా మహమ్మారి కాలంలో 240 బాల్య వివాహాలు జరిగాయని వెల్లడించాయి. కానీ కేవలం ముగ్గురిపై మాత్రమే కేసులు నమోదయ్యాయని స్త్రీ శిశు సంక్షేమ శాఖ తెలిపింది. గత ఏడాది విధించిన లాక్డౌన్లోనూ భారీ సంఖ్యలో బాల్య వివాహాలు జరిగాయని వెల్లడించింది.
కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వ వర్గాలు ప్రస్తుతం నిమగ్నమవుతుండగా.. బాల్య వివాహాలు వెలుగులోకి రాకుండా పోతున్నాయని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇదీ చదవండి: నదిలో మృతదేహాలు- పీక్కు తింటున్న కుక్కలు!