ETV Bharat / bharat

మహిళకు అరుదైన శస్త్రచికిత్స.. 46 కిలోల కణితి తొలగింపు.. 5నెలల తర్వాత..

బంగాల్​లోని ఓ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. మహిళ కడుపులో నుంచి 46 కిలోల కణితిని తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు.

rare surgery in kolkata
అరుదైన శస్త్రచికిత్స
author img

By

Published : Dec 26, 2022, 10:48 PM IST

బంగాల్​ కోల్​కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. మహిళ కడుపులో నుంచి 46 కిలోల కణితిని తొలగించారు. ఐదు నెలల క్రితం జరిగిన వైద్యులు ఈ శస్త్రచికిత్స చేయగా.. రోగి ఇప్పటికి పూర్తిగా కోలుకుందని వైద్యులు తెలిపారు.

rare surgery in kolkata
శస్త్రచికిత్స చేస్తున్న వైద్యులు
ఇదీ జరిగింది.. సుస్మితా దాస్(61) అనే మహిళ గత 15 ఏళ్లుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. ఏడు నెలల క్రితం ఆరోగ్యం బాగా క్షీణించి నడవలేని స్థితికి చేరుకుంది. దీంతో పాటు శ్వాస సమస్యలు వచ్చాయి. ఈ క్రమంలో ఆమెను కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఓ​ క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెకు అక్కడ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుబ్రత్ షా పర్యవేక్షణలో సర్జరీ జరిగింది. అయితే, ఇన్నిరోజులు ఆమెను పర్యవేక్షణలో ఉంచినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకుందనివెల్లడించారు. తాజాగా మరోసారి ఆమెకు పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.
rare surgery in kolkata
ఆపరేషన్ చేస్తున్న వైద్యులు
rare surgery in kolkata
మహిళ కడుపులో నుంచి 46 కిలోల కణితి తొలగింపు

"ఆస్పత్రికి వచ్చేసరికి రోగి పరిస్థితి విషమంగా ఉంది. మెల్లగా చికిత్సను ప్రారంభించాం. మహిళకు సీటీ స్కాన్ చేశాం. అందులో పెద్ద కణితి కనిపించింది. ఆ తర్వాత ఆరుగురు వైద్యులు బృందంగా ఏర్పడి ఆపరేషన్ నిర్వహించి 46 కిలోల కణితిని తొలగించాం. రోగి బరువు 50 కిలోలే అయినప్పటికి కణితి వల్ల దాదాపు 100 కిలోల బరువు ఉండేది. అందుకే ఆమె కడుపునొప్పితో బాధపడేది. నడవడానికి కూడా ఇబ్బందిపడేది. ఆమె కుటుంబ సభ్యుల సమ్మతితోనే ఈ ఏడాది జూలైలో ఆపరేషన్ చేశాం. సర్జరీకి రెండు గంటల సమయం పట్టింది. కొన్ని రోజులు ఐసీయూలో ఉంచిన తర్వాత డిశ్చార్డ్ చేశాం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉంది. నడవగలుగుతోంది."
--సుబ్రత్ షా, సర్జికల్ ఆంకాలజిస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.