ETV Bharat / bharat

తనయుడితో కలిసి పదో తరగతి పరీక్ష.. తండ్రి పాస్​.. కొడుకు ఫెయిల్​ - మహారాష్ట్ర పదో తరగతి ఫలితాల న్యూస్​

తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకేసారి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో తండ్రి పాస్​ కాగా.. కొడుకు ఫెయిల్​ అయ్యాడు. ఈ ఆసక్తికర ఘటన మహారాష్ట్ర పుణెలో జరిగింది.

father pass and son fail in exam
father pass and son fail in exam
author img

By

Published : Jun 19, 2022, 2:12 PM IST

మహారాష్ట్ర పుణెలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. తండ్రీకొడుకులు ఇద్దరూ పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. తాజాగా మహారాష్ట్ర సెకండరీ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో తండ్రి పాస్ కాగా.. కుమారుడు మాత్రం ఫెయిల్​ అయ్యాడు. తాను పాస్ అయినందుకు సంతోషంగా ఉన్నా.. కుమారుడు రెండు పేపర్లలో ఫెయిల్​ అయ్యాడని బాధగా ఉందన్నాడు తండ్రి భాస్కర్​. సప్లిమెంటరీ పరీక్షల కోసం తన కొడుకుకు సాయం చేస్తానని చెప్పాడు.

పుణెకు చెందిన భాస్కర్ వాఘ్మరె ఏడో తరగతిలో ఉండగా.. కుటుంబ సమస్యలతో మధ్యలోనే చదువును ఆపేశాడు. ఆ తర్వాత కుటుంబ బాధ్యతను తీసుకున్నాడు. తిరిగి 30 ఏళ్ల తర్వాత తన కుమారుడితో కలిసి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. పుణెలో ప్రైవేట్​ సంస్థలో పని చేస్తానని.. రోజూ పని పూర్తయ్యాక వచ్చి పరీక్షలకు చదువుకునే వాడినని భాస్కర్​ చెప్పాడు.

"నేను ఎంతో చదవాలి అనుకున్నాను. కానీ కుటుంబ బాధ్యతలు తీసుకుని మధ్యలోనే చదువును ఆపేశాను. చదువును కొనసాగిస్తే మరింత సంపాదించొచ్చు అనుకొని.. పది పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాను. నా కుమారుడు పదో తరగతి చదువుతుండడం వల్ల నాకు సహాయం చేసేవాడు."

- భాస్కర్​ వాఘ్మరె, తండ్రి

"నా తండ్రి పదో తరగతి పాస్​ అయినందుకు ఆనందంగా ఉంది. నేను కూడా దీనిని వదిలిపెట్టను. సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాస్​ అయ్యేందుకు ప్రయత్నిస్తాను."

-సహిల్​, కుమారుడు

మహారాష్ట్రలో గతేడాది కరోనా కారణంగా ఇంటర్నల్​ మార్కుల ఆధారంగా అందరినీ పాస్​ చేశారు. కానీ ఈసారి కొవిడ్​ ప్రభావం తగ్గడం వల్ల 30 నిమిషాల అదనపు సమయం ఇచ్చి పరీక్షలు నిర్వహించారు. ​​గతేడాది 99.95 శాతం మంది పాస్​ కాగా.. ఈ ఏడాది 96.94 శాతం మంది పాస్​ అయ్యారు.

ఇదీ చదవండి: 'మొసలిని పట్టుకున్న మోదీ'.. పాఠ్యాంశంగా ప్రధాని సాహసం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.