కర్ణాటకలోని విజయపుర జిల్లా తొరవి గ్రామంలో ఒక్క నెలలోనే కరోనాతో 40 మంది చనిపోయారు. కరోనా రెండో దశ మొదలైన నాటి నుంచి 70 మంది కొవిడ్ కాటుకు బలయ్యారు. మాజీ మంత్రి ఎమ్బీ పాటిల్ ఈ విషయం వెల్లడించారు.
విజయపుర పట్టణానికి తొరవి గ్రామం కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అదీ కాక ఇక్కడ మార్కెట్లు ఎక్కువగా ఉంటాయి. దాంతో గ్రామంలోని చాలా మంది కరోనా బారిన పడ్డారు.
పాటిల్ ఈ విషయాన్ని చెప్పిన తర్వాత వెంటనే ఆరోగ్యశాఖ అధికారులు గ్రామాన్ని సందర్శించి కరోనా పరీక్షలు చేశారు. 100 మందికి పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం వాళ్లంతా హోం ఐసోలేషన్లో ఉన్నారు. కొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామ పంచాయతీని కొవిడ్ కేర్ సెంటర్ మార్చడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఒకే గ్రామంలో 128మందికి కరోనా
చిక్కమగళూరు జిల్లా ఇందిరానగర్ గ్రామంలో 128 మందికి కరోనా సోకింది. కొద్ది రోజుల క్రితం గుండె పోటుతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు వారంతా వెళ్లారు. అయితే ఆ వ్యక్తి కరోనాతో మృతి చెందలేదు.
ఇదీ చదవండి: కరోనాకు ఒకేరోజు బలైన కవల సోదరులు