ETV Bharat / bharat

ఐదు తుపాన్లలో అంపన్​ అత్యంత తీవ్రమైనది - బంగాళాఖాతం

ఈ ఏడాదిలో వచ్చిన ఐదు తుపాన్లలో నాలుగు తీవ్రమైనవని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. నవంబరులో మూడు తుపాన్లు వరుసగా వచ్చి నష్టం కలిగించాయని చెప్పింది. అన్నింటికంటే అంపన్​ తుపాను​ అత్యంత తీవ్రమైందని పేర్కొంది.

4 of 5 cyclones this year were in severe cyclonic storms category and above
ఆ ఐదు తుపాన్లలో అంపన్​ తీవ్రతే ఎక్కువ
author img

By

Published : Dec 7, 2020, 5:25 AM IST

దేశంలో ఈ ఏడాది మొత్తం ఐదు తుపాన్లు రాగా, అందులో నాలుగు తీవ్రంగా మారాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. గత నెలలోనే మూడు తుపాన్లు వరుసగా వచ్చి తీవ్ర నష్టం కలిగించాయని ఐఎండీ డైరెక్టర్​ జనరల్​ మృత్యుంజయ్​ మహాపాత్ర చెప్పారు. తొలుత మే 19న బంగాల్​-బంగ్లాదేశ్​ తీరం మీదుగా దేశంలోకి ప్రవేశించిన 'అంపన్' తుపాను బీభత్సం సృష్టించింది. ఆ తర్వాత అరేజియాలో ఉద్భవించిన 'నిసర్గ' తుఫాన్​ ముంబయిని వణికించింది.

నవంబరులో అరేబియాలో వచ్చిన 'గతి' తుఫాన్​ కేరళలో కుంభవృష్టి కురిపించింది. ఇదే నెలలో బంగాళాఖాత తీరంలో పుట్టిన 'నివర్​' తుపాను​ తమిళనాడు తీరంలోనే కల్లోలం రేపింది. వారం వ్యవధిలోనే శ్రీలంక తీరం మీదుగా వచ్చిన 'బురేవి' తుఫాన్​ దక్షిణ తమిళనాడును కుదిపేసింది. పైవాటన్నింట్లో అంపన్​ తుపాను అత్యంత తీవ్రమైందని, ఈ సందర్భంగా సముద్ర జలాలు 10 మీటర్ల మేర భూభాగంలోకి చొచ్చుకొచ్చాయని మహాపాత్ర చెప్పారు. రానున్న వారం రోజుల్లో తుపాన్లు వచ్చే అవకాశం తక్కువేనని తెలిపారు.

ఇదీ చూడండి:కరోనా రూల్స్ బ్రేక్ చేస్తే వ్యాసం రాయాల్సిందే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.