హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో నలుగురు ఇంటి సభ్యులు సజీవదహనమయ్యారు.
జిల్లాలోని సుయిలా గ్రామంలో జరిగిన ప్రమాదంలో పలు జంతువులు కూడా మృతిచెందినట్లు అధికారులు పేర్కొన్నారు.
సీఎం దిగ్భ్రాంతి..
అగ్ని ప్రమాదం జరిగి.. నలుగురి సజీవదహనమైన ఘటనపై ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి సంతాపం ప్రకటించారు.
ఇదీ చదవండి:'సైకత' హోలీ.. కరోనా జాగ్రత్తలు తప్పనిసరి!