ETV Bharat / bharat

'నారదా స్టింగ్​ కేసు'లో మంత్రులకు గృహ నిర్బంధం

నారదా కేసులో అరెస్టైన ఇద్దరు మంత్రులు సహా నలుగుర నేతలకు కోల్​కతా హైకోర్టు.. గృహ నిర్బంధం విధించాలని ఆదేశించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన బెయిల్​పై స్టేను ఎత్తివేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది.

Calcutta HC
కోల్​కతా హైకోర్టు
author img

By

Published : May 21, 2021, 2:02 PM IST

నారదా స్టింగ్​ కేసులో అరెస్టైన ఇద్దరు మంత్రులు సహా నలుగురు నేతలను గృహ నిర్బంధం చేయాలని కోల్​కతా హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ కేసులో అరెస్టైన మంత్రులు సుబ్రతా ముఖర్జీ, ఫిర్హాద్ హకీం, టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా, కోల్​కతా మాజీ మేయర్​ సోవన్​ ఛటర్జీలపై సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన బెయిల్​పై స్టేను ఎత్తివేయాలన్న అభ్యర్థనను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రాజేశ్​ బిందాల్ ధర్మాసనం​ తోసిపుచ్చింది. వారికి గృహ నిర్బంధం విధించాలని ఆదేశించింది.

ఈ కేసును విచారిస్తున్న ధర్మాసనంలోని న్యాయమూర్తుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నందున వేరే బెంచ్​కు బదిలీ చేస్తున్నట్లుగా న్యాయస్థానం తెలిపింది.

సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్​ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.

ఇదీ చూడండి: నారదా కుంభకోణం- టీఎంసీ మంత్రులు జైలుకు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.