ETV Bharat / bharat

వసతిగృహంలో 39 మంది విద్యార్థులకు కరోనా

దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గుజరాత్​ సాబర్​కాంఠా జిల్లాలోని ఓ వసతిగృహంలో ఒకే రోజు 39 మంది విద్యార్థులు కొవిడ్​ బారినపడ్డారు.

39 students test positive in Sabarkantha hostel
వసతిగృహంలో 39 మంది విద్యార్థులకు కరోనా
author img

By

Published : Mar 22, 2021, 5:44 AM IST

గుజరాత్​ సాబర్​కాంఠా జిల్లాలో కరోనా కలకలం రేగింది. అక్కడి ఓ వసతి గృహంలో 39 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు ఓ ఆరోగ్య అధికారి వెల్లడించారు. అయితే.. చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని చెప్పారు.

సహ్యోగ్​ కుష్థా యగ్న ట్రస్ట్​ ఆధ్వర్యంలో నడిచే హాస్టల్​లోని 292 మందికి ఆదివారం పరీక్షలు నిర్వహించగా.. 39 నమూనాలు పాజిటివ్​గా తేలినట్లు ట్రస్ట్​ ప్రతినిధి తెలిపారు. కొందరు విద్యార్థుల్ని వారి తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లగా.. మిగతా వారిని ఆసుపత్రిలో చేర్పించినట్లు స్పష్టం చేశారు.

రెండు రోజుల ముందు ఈ హాస్టల్​ వార్డెన్​కు కరోనా సోకిందని, ఈ నేపథ్యంలోనే విద్యార్థులందరికీ టెస్ట్​లు నిర్వహించినట్లు పేర్కొన్నారు.​

ఈ జిల్లాలో ఇప్పటివరకు 3,281 కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి: రాజస్థాన్​లో రాత్రి కర్ఫ్యూ- గుజరాత్​లో హోలీ నిషేధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.