ETV Bharat / bharat

చైనా జలాల్లో చిక్కుకున్న 39 మంది భారతీయులు - చైనా జలాల్లో భారతీయ నౌకలు

కొద్ది నెలలుగా చైనా జలాల్లో చిక్కుకుపోయిన నౌకలోని భారత సిబ్బంది విషయంపై ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్రం వెల్లడించింది. స్థానికంగా విధించిన కరోనా ఆంక్షల కారణంగా వారిని తిరిగి పంపించేందుకు అనుమతులు లభించలేదని పేర్కొంది. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

39 Indians on board two stranded ships in Chinese waters; India in touch with China: MEA
చైనా జలాల్లో చిక్కుకున్న 39 మంది భారతీయులు
author img

By

Published : Dec 18, 2020, 5:35 AM IST

Updated : Dec 18, 2020, 7:06 AM IST

చైనా జలాల్లో చిక్కుకుపోయిన రెండు నౌకల్లోని 39 మంది భారతీయుల విషయంపై ఆ దేశంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. గత కొద్ది నెలలుగా వారు చైనాలోనే ఉన్నారని వెల్లడించింది.

ఎంవీ జగ్ ఆనంద్ అనే భారీ రవాణా నౌక హెబెయి రాష్ట్రంలోని జింగ్​తంగ్​ పోర్టులో నిలిచి ఉందని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వెల్లడించారు. జూన్ 13 నుంచి ఈ నౌక చైనాలోనే ఉందని తెలిపారు. ఇందులో 23 మంది భారతీయు సిబ్బంది ప్రయాణించారని చెప్పారు. 16 మంది సిబ్బందితో ఎంవీ అనస్తీషియా అనే మరో నౌక.. కావోఫిడియన్​ పోర్టులో నిలిచిపోయిందని వివరించారు. సెప్టెంబర్ 23 నుంచి ఇది అక్కడే ఉందని స్పష్టం చేశారు.

"చైనా అధికారులతో మన రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోంది. స్థానికంగా విధించిన కరోనా ఆంక్షల కారణంగా సిబ్బందిని మార్చేందుకు అనుమతులు జారీ చేయడం లేదని చైనా అధికారులు తెలిపారు."

-అనురాగ్ శ్రీవాస్తవ, విదేశాంగ శాఖ ప్రతినిధి

నౌకలు ఆలస్యంగా రావడంపై షిప్పింగ్ యాజమాన్యాలకు సమాచారాన్ని అందించినట్లు తెలిపారు శ్రీవాస్తవ. ఈ సమస్య పరిష్కారానికి అక్కడి అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

Last Updated : Dec 18, 2020, 7:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.