రాజస్థాన్లోని దౌసా జిల్లాలో గత 21 రోజుల్లో 18 ఏళ్ల లోపున్న 341 మంది కరోనా బారినపడ్డారు. అయితే ఎవరిలోనూ తీవ్ర సమస్యలు లేవని జిల్లా కలెక్టర్ తెలిపారు.
"కరోనా మొదటి దశలో పిల్లల్లో వైరస్ లక్షణాలు వెలుగుచూశాయి. 18 సంవత్సరాల వయసు లోపున్న పిల్లలు కరోనా బారిన పడుతున్నారు, కానీ ఆసుపత్రిలో చేరేంత సమస్యలు లేవు. పిల్లలపై కరోనా మూడో దశ ప్రభావం ఏమేరకు ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అందుకోసం జిల్లా ఆసుపత్రిని అప్రమత్తం చేశాం."
-పీయూశ్ సమరియా, జిల్లా కలెక్టర్
బిహార్లో
బిహార్ చంపారన్ జిల్లాలోని బేతియా, ధుమ్నగర్లో 20 రోజుల్లో 20 మంది చనిపోయారు. అందులో ఒకరు మినహా మిగతా వారంతా ఇతర రోగాల వల్ల మరణించారు. అయితే వారంతా కొవిడ్ వల్ల మృతి చెందారనే వాదనలు ఉన్నాయి.
"ధుమ్నగర్లో చాలా మందిలో కరోనా లక్షణాలు ఉన్నాయి కానీ ఆసుపత్రిలో సరైన సదుపాయం లేక అక్కడికి వెళ్లడం లేదు" అని స్థానిక వ్యక్తి ఒకరు తెలిపారు.
కరోనా పరీక్షలు చేయకపోవడం, ఆసుపత్రిలో సరైన వైద్య సౌకర్యలు లేకపోవడం వల్ల ఇంత మంది చనిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: 'విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత, భవిష్యత్తే ముఖ్యం'