మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తగ్గింది. సోమవారం కొత్తగా 31,643 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. 20,854 మంది కోలుకోగా.. 102 మంది ప్రాణాలు కోల్పోయారు.
మాహారాష్ట్రలో కేసులు
- మొత్తం కేసులు : 27,45,518
- మొత్తం రికవరీలు : 23,53,307
- మొత్తం మరణాలు : 54,283
- యాక్టివ్ కేసులు : 3,36,584
గుజరాత్లో కేసులు..
గుజరాత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 2,252 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. 1,731 మంది కోలుకోగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు : 3,03,118
- మొత్తం రికవరీలు : 2,86,577
- మొత్తం మరణాలు : 4,500
- యాక్టివ్ కేసులు : 12,041
పంజాబ్‌లో
పంజాబ్‌లో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 2,914 మందికి వైరస్ సోకింది. 2,583 మంది రికవరీ అయ్యారు. మరో 59 మంది మృత్యువాత పడ్డారు.
- మొత్తం కేసులు : 2,34,602
- మొత్తం రికవరీలు : 2,03,710
- మొత్తం మరణాలు : 6,749
- యాక్టివ్ కేసులు : 24,143
కర్ణాటకలో కేసులు
కర్ణాటకలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. మరో 2,792 మందికి పాజిటివ్‌గా తేలింది. వీటిలో 1,770 కేసులు బెంగళూరులోనే నమోదయ్యాయి. మరో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,964 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
- మొత్తం కేసులు : 9,89,804
- మొత్తం రికవరీలు : 9,53,416
- మొత్తం మరణాలు : 12,520
- యాక్టివ్ కేసులు : 23,849
ఇదీ చదవండి : తమిళనాడులో రూ.12 కోట్ల బంగారం స్వాధీనం