ETV Bharat / bharat

కేంద్రమంత్రి గ్రామంలో 2 వారాల్లో 30 మరణాలు! - వీకే సింగ్​

కేంద్రమంత్రి వీకే సింగ్ గ్రామంలో రెండు వారాల్లో 30 మరణాలు నమోదయ్యాయి. గ్రామస్థులు కొవిడ్​ పరీక్షలు చేయించుకోనందున ఈ మరణాల వెనుక గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అధికారులు అంబులెన్సు ఏర్పాటు చేసి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

vk singh news, వీకే సింగ్​
కేంద్ర మంత్రి వీకే సింగ్
author img

By

Published : May 17, 2021, 7:08 AM IST

కేంద్రమంత్రి వీకే సింగ్​ స్వగ్రామమైన భివానీ జిల్లా బపోరాలో గత రెండు వారాల్లో 30 మంది అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు. వీరిలో పలువురికి కరోనా లక్షణాలు కనిపించినా.. ముగ్గురికి మాత్రమే పాజిటివ్​గా పరీక్షల్లో తేలినట్టు గ్రామ సర్పంచి నరేశ్​కుమార్​ ఆదివారం తెలిపారు. గ్రామస్థులు కొవిడ్​ పరీక్షలు చేయించుకోనందున ఈ మరణాల వెనుక గల కారణాలు తెలియకుండా పోయాయన్నారు. మృతుల్లో చాలామంది వృద్ధులని తెలిపారు. 20వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో అధికారులు ఇప్పుడు అంబులెన్సు ఏర్పాటు చేసి, హడావుడిగా అందరికీ కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు.

చుట్టుపక్కల మరికొన్ని గ్రామాల్లోనూ పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. గత నెల రోహ్​తక్​ జిల్లా టిటౌలి గ్రామంలో 21 మంది మృతిచెందారు. ఇందులో కరోనా మరణాలు నాలుగే అని అధికారులు లెక్క తేల్చారు. భివానీ జిల్లాలోని ముంఢాల్​ ఖుర్ద్​, ముంఢాల్​ కలాన్​ గ్రామాల్లో గత కొన్ని వారాల్లో 40 మంది మృతిచెందారు. గ్రామాల్లో కరోనా నివారణకు ప్రభుత్వం ఓ టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేయాలని హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్​సింగ్​ హుడా డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి : కరోనాలో కొత్త లక్షణం.. 'కొవిడ్‌ టంగ్‌'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.