ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చాలామంది కలలు కంటారు. ఎంతో శ్రమిస్తే తప్ప.. ఏ కొద్ది మందికో తప్ప అందరికీ ఆ కల నెరవేరదు. మరి అలాంటిది ఒకే ఇంటి నుంచి ఐదుగురు అమ్మాయిలు.. ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు కదా? రాజస్థాన్ హనుమాన్‌గఢ్‌కు చెందిన ఐదుగురు తోబుట్టువులు మాత్రం ఈ అరుదైన ఘనత సాధించారు.
రాజస్థాన్ స్టేట్ అడ్మనిస్ట్రేటివ్ సర్వీస్(ఆర్ఏఎస్) పరీక్షలో అన్షు, రీతు, సుమన్ అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేసారి ఉత్తీర్ణులయ్యారు. అయితే.. వారి మరో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కుడా ఇప్పటికే ఆర్ఏఎస్ అధికారులుగా ఉండటం విశేషం. దాంతో ఇప్పుడు ఒకే ఇంటి నుంచి ఐదుగురూ ఆర్ఏఎస్ అధికారులుగా మారారు. ఈ విషయాన్ని ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రవీణ్ కాసవాన్.. ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ ముగ్గురు అక్కాచెలెళ్లకు అభినందిస్తూ వారి ఫొటోను పోస్ట్ చేశారు.
-
Such a good news. Anshu, Reetu and Suman are three sisters from Hanumangarh, Rajasthan. Today all three got selected in RAS together. Making father & family proud. pic.twitter.com/n9XldKizy9
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Such a good news. Anshu, Reetu and Suman are three sisters from Hanumangarh, Rajasthan. Today all three got selected in RAS together. Making father & family proud. pic.twitter.com/n9XldKizy9
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 14, 2021Such a good news. Anshu, Reetu and Suman are three sisters from Hanumangarh, Rajasthan. Today all three got selected in RAS together. Making father & family proud. pic.twitter.com/n9XldKizy9
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 14, 2021
"రాజస్థాన్ హనుమాన్‌గఢ్‌కు చెందిన అన్షు, రీతు, సమన్.. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆర్ఏఎస్ అధికారులుగా ఎంపికయ్యారు. ఇదో మంచి వార్త. వీరు తమ తండ్రిని, కుటుంబాన్ని గర్వపడేలా చేశారు. వీరి మరో ఇద్దరు అక్కాచెల్లెళ్లు రోమా, మంజు ఇప్పటికే ఆర్ఏఎస్ అధికారులుగా ఉన్నారు. సహదేవ్ సహారన్ అనే రైతు బిడ్డలైన ఈ ఐదుగురూ ఇప్పడు ఆర్ఏఎస్ అధికారులే."
- ప్రవీణ్ కాసవాన్, ఐఎఫ్ఎస్ అధికారి
ప్రవీణ్ కాసవాన్ చేసిన ట్వీట్‌కు 6 వేలకుపైగా లైకులు వచ్చాయి. ఈ తోబుట్టువులను నెటిజన్లు తమ కామెంట్లలో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఆర్ఏఎస్ 2018 ఫలితాలను రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఆర్పీఎస్సీ) మంగళవారం విడుదల చేసింది. ఝంఝునుకు చెందిన ముక్తా రావ్ ఈ పరీక్షలో టాపర్‌గా నిలవగా... టోంక్‌కు చెందిన మన్మోహన శర్మ, జైపుర్‌కు చెందిన శివాక్షి ఖందల్.. రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
ఆర్ఏఎస్ టాపర్లను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్.. ట్విట్టర్లో అభినందించారు. రాష్ట్రానికి సేవ చేసేందుకు వారికి దొరికిన గొప్ప అవకాశం ఇది అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: సెలూన్‌లోకి అనుకోని అతిథి- గంటసేపు మేకప్!
ఇదీ చూడండి: ఐబీపీఎస్ క్లర్క్ పోస్టుల భర్తీకి బ్రేక్!