ETV Bharat / bharat

చిన్నారులపై పడిన ట్రక్కు- ఒకే కుటుంబంలోని ముగ్గురు దుర్మరణం - మహారాష్ట్రలో ముగ్గురు అక్కాచెళ్లిల్లు మృతి

sisters killed by truck fall: ఇటుక బట్టీల బొగ్గును అన్​లోడ్​ చేస్తుండగా వాహనం ఒక పక్కకు ఒరిగి ముగ్గురు చిన్నారులపై పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబంలోనే ముగ్గురూ చనిపోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని భివాండీ తహసీల్​లో జరిగింది.

sisters killed by truck fall
ట్రక్కు మీద పడి ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు మృతి
author img

By

Published : Jan 27, 2022, 6:35 AM IST

Sisters killed by truck fall: మహారాష్ట్ర ఠాణె జిల్లాలో దారుణం జరిగింది. భివాండీ తహసీల్​లో ఇటుక బట్టీలకు ఉపయోగించే బొగ్గును అన్​లోడ్​ చేస్తుండగా ట్రక్కు పడి ముగ్గురు చిన్నారులు చనిపోయారు. వీరంతా ఒకే కుటుంబానికి సంబంధించిన వారు కావడం గమనార్హం. అందులోనూ వారి వయసు కేవలం ముూడు నుంచి ఏడేళ్లులోపు మాత్రమే ఉన్నట్లు సంబంధీకులు తెలిపారు.

ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురు చిన్నారుల సోదరి ప్రాణాలతో బయటపడింది. ఆ పాపకు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. చనిపోయిన వారి తల్లిదండ్రులు ఆ ఇటుక బట్టీల వద్ద కార్మికులుగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనతో సంబంధం ఉన్న ఇటుక బట్టీ యజమాని సహా నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇటుక బట్టీ యజమాని గోపీనాథ్ మద్వి, బొగ్గు తీసుకు వచ్చిన సురేష్ రాందాస్ పాటిల్, ట్రక్కు డ్రైవర్ తౌఫిక్ షేక్​లను పోలీసులు అరెస్ట్​ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: రైలు​ కిందపడి ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.