రెండేళ్ల కింద ఓ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దోషులుగా తేలిన ముగ్గురికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తలో 32 వేల రూపాయల చొప్పున జరిమానా కట్టాలని ఆదేశించింది.
జిల్లా అదనపు సెషన్స్ కోర్టు ప్రత్యేక జడ్జి సంతోష్ కుమార్ యాదవ్ ఈ తీర్పును వెల్లడించారు.
2019 మార్చిలో 15 ఏళ్ల బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 3 నెలల పాటు ఆమెతో బలవంతంగా శారీరక సంబంధం కొనసాగించి.. బాధితురాలు గర్భం దాల్చేందుకు కారణమయ్యారు.
ఆమెకు బలవంతంగా గర్భనిరోధక మాత్రలు వేయగా.. అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కోలుకున్న తర్వాత.. కుటుంబసభ్యులకు జరిగిన విషయం చెప్పింది.
ఇదీ చూడండి: అత్యాచారం జరిగిన 17ఏళ్లకు ఫిర్యాదు