ETV Bharat / bharat

ఔరా: కాళ్లతోనే బౌలింగ్​.. బ్యాట్స్​మెన్​ పరేషాన్​

author img

By

Published : Apr 5, 2021, 10:15 AM IST

'మనసుంటే మార్గం ఉంటుంది.', 'సంకల్ప శక్తి, అంకితభావం ఉంటే ఏదైనా సాధించగలరు.'.. ఈ సామెతలను నిజమని నిరూపించారు కశ్మీర్​కు చెందిన దివ్యాంగ క్రికెటర్​ ఆమిర్​ లోనె. కాళ్లతో బౌలింగ్​ చేసే ఆటగాడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. త్వరలో షార్జాలో జరిగే 'దివ్యాంగ ప్రీమియర్​ లీగ్​'కు ఎంపికయ్యాడు.

Amir Lone
సాధించిన పథకాలతో అమిర్​

దక్షిణ కశ్మీర్​ అనంతనాగ్​ జిల్లాలోని బిజ్​బిహారా పట్టణానికి చెందిన 27 ఏళ్ల ఆమిర్ లోనె​.. 'దివ్యాంగ ప్రీమియర్​ లీగ్​'కు ఎంపికయ్యాడు.

చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో రెండు చేతులను పోగొట్టుకున్నా విజయపథంలో ఆమిర్ ఏ మాత్రం వెనుకబడలేదు. ఎంతో ఇష్టమైన క్రికెట్​లో శిక్షణ తీసుకుని అద్భుత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. కాళ్లతోనే బౌలింగ్ చేస్తూ.. బ్యాట్స్​మెన్​ను కట్టడి చేస్తూ..​. అందరితో ఔరా అనిపించుకుంటున్నాడు.

Amir Lone
కాళ్లతోనే బౌలింగ్ చేస్తున్న ఆమిర్​

మైదానంలో ఆమిర్​ ఆల్​లౌండర్​ ప్రదర్శనను వీక్షించడానికి ప్రేక్షకులు సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. మెడతోనే బ్యాట్​ను పట్టుకుని కౌశల ప్రదర్శనను ఇస్తాడు ఆమిర్​. ఈ కారణంగానే అయన జాతీయ స్థాయిలో బహుమతులను గెలుచుకున్నాడు. జమ్ముకశ్మీర్ పారా క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా నియమితులైన అతడు.. జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. దీంతో షార్జాలో.. దివ్యాంగ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న 'దివ్యాంగ క్రికెట్ లీగ్​'కు ఆడటానికి ఎంపిక అయ్యాడు.

Amir Lone
సాధించిన పథకాలతో ఆమిర్​

''ఇది మేము గర్వించదగ్గ విషయం. పిల్లల విజయాన్నే ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. షార్జాలో జరిగే క్రికెట్​ లీగ్​కు ఆమిర్​ ఎంపికవటం కన్నా గొప్ప విషయం ఏముంటుంది? మా కుమారుడు ఇంకా మరిన్ని అవకాశాలను అందుకుంటాడు. మరెన్నో పురస్కారాలు కైవసం చేసుకుంటాడన్న నమ్మకం ఉంది.''

-ఆమిర్​ తల్లి

దివ్యాంగ ప్రీమియర్​ లీగ్​ షార్జాలో ఈనెల​ 8 నుంచి 15వ తేదీ వరకు జరగనుంది.

Amir Lone
సత్కారాలను పొందుతున్న ఆమిర్

ఇదీ చదవండి: 16 అడుగుల కింగ్​ కోబ్రా చూశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.