ETV Bharat / bharat

ఒడిశాలో 'టమాట ఫ్లూ' కలకలం.. 26 మందికి పాజిటివ్​ - టమాట ఫ్లూ కేసులు

Tomato flu: ఒడిశాలో 26 మంది చిన్నారులకు టమాట ఫ్లూ సోకింది. ప్రస్తుతం వీరందరి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఏడు రోజుల పాటు ఐసోలేషన్​లో ఉండాలని సూచించినట్లు పేర్కొన్నారు.

tomato flu' cases in Odisha
ఒడిశాలో టమాట ఫ్లూ కలకలం
author img

By

Published : May 24, 2022, 7:19 PM IST

Odisha Tomato flu: ఒడిశాలో టమాట ఫ్లూ కలకలం రేపింది. హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్​(HFMD)గా పిలిచే ఈ వ్యాధి 26 మంది చిన్నారులకు సోకింది. సాధారణంగా దీన్ని టమాట ఫ్లూ అంటారు. పేగు సంబంధిత వైరస్ కారణంగా ఈ అంటు వ్యాధి సోకుతుంది. ముఖ్యంగా చిన్నారులకు ఇది వ్యాపిస్తుంది. వయోజనులకు ఈ వైరస్​ను తట్టుకునే రోగ నిరోధక శక్తి ఉండటం వల్ల వారిపై ఈ వ్యాధి ప్రభావం చూపదు.

Tomato flu symptoms: ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఈ వ్యాధి సోకిన చిన్నారులకు జ్వరం, నోట్లో పుండ్లు, చేతులు, కాళ్లు, పిరుదులపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. మొత్తం 36 మంది చిన్నారుల నమూనాలను పరీక్షించగా 26 మందికి ఈ వ్యాధి సోకినట్లు తేలిందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. భువనేశ్వర్​లోని రీజినల్ మెడికల్​ రీసెర్చ్ సెంటర్​లో ఈ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

Tomato flu cases: వ్యాధి బారినపడిన వారిలో 1-9 ఏళ్ల మధ్య వయసు పిల్లలే ఉన్నట్లు అధికారులు చెప్పారు. వారందరినీ 5-7 రోజుల పాటు ఐసోలేషన్​లో ఉండాలని సూచించారు. అందరి పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ అంటువ్యాధి ప్రాణాంతకం కాదని వివరించారు. ఈ నెల మొదట్లోనే కేరళలోని కొల్లం జిల్లాలోనూ 80 చిన్నారులు టమాట ఫ్లూ బారినపడ్డారు. దీంతో పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి. సరిహద్దు జిల్లాలను అప్రమత్తం చేశాయి.

ఇదీ చదవండి: ఫోన్ కొట్టేశాడని.. మెడలో చెప్పుల దండ వేసి, లారీకి కట్టేసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.