మహారాష్ట్ర రిసోద్ తాలూకాలోని డెగావ్లో 229 మంది పాఠశాల విద్యార్థులకు కరోనా సోకింది. మరో నలుగురు సిబ్బందికి కూడా వైరస్ నిర్ధరణ అయ్యినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయం తెలుసుకొన్న కలెక్టర్ షణ్ముగరాజన్ పాఠశాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మహమ్మారి సోకిన విద్యార్థులకు మెరుగైన చికిత్స, సరైన సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. పర్యావేక్షణాధికారిగా అసిస్టెంట్ కలెక్టర్ వైభవ్ వాగ్మారేను నియమించారు.