ETV Bharat / bharat

ముంబయిలో 2,200 రెమ్​డెసివిర్​ వయల్స్​ సీజ్​ - అక్రమంగా రెమ్​డెసివిర్ వయల్స్

అక్రమంగా నిల్వచేసిన ​2,200 రెమ్​డెసివిర్ వయల్స్​ను ముంబయి పోలీసులు, ఎఫ్​డీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో తనిఖీలు నిర్వహించగా వీటిని పట్టుకున్నట్లు చెప్పారు.

remdesivir vials
ముంబయిలో 2,200 రెమ్​డెసివిర్​ వయల్స్​ సీజ్​
author img

By

Published : Apr 20, 2021, 3:25 PM IST

ముంబయిలో విదేశాలకు ఎగుమతి చేసేందుకు నిల్వచేసిన ​2,200 రెమ్​డెసివిర్ వయల్స్​ను పోలీసులు, ఆహార ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్​డీఏ) అధికారులు సీజ్​ చేశారు. ముందస్తుగా అందిన సమాచారంతో పోలీసులు, ఎఫ్​డీఏ అధికారులు సబర్బన్​ అందేరి, న్యూ మెరైన్​ లైన్స్​ ప్రాంతాల్లో సోదాలు చేసి వీటిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.

తూర్పు అందేరీలోని మరోల్​ ప్రాంతంలో 2,000 రెమ్​డెసివిర్ వయల్స్​ను, న్యూ మెరైన్​ లైన్స్​లో మరో 200 వయల్స్​ను స్వాధీనం చేసుకున్నామని పోలీసుల అధికార ప్రతినిధి చైతన్య ఓ ప్రకటనలో తెలిపారు. వీటిని ఆసుపత్రులకు అందజేస్తామని చెప్పారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఎఫ్​డీఏ అధికారుల సమన్వయంతో సోదాలు నిర్వహించినట్లు డీసీపీ మంజనాథ్​ పేర్కొన్నారు.

కరోనా చికిత్సలో కీలకమైన రెమ్​డెసివిర్ ఇంజెక్షన్​ ఎగమతులపై కేంద్రం గతవారం నిషేధం విధించింది.

ఇదీ చూడండి: స్పుత్నిక్​-వి 10 రోజుల్లో భారత్​లోకి!

ఇదీ చూడండి: లాక్​డౌన్​పై యూపీ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.