కుటుంబసభ్యులకు ఇష్టం లేని వివాహం చేసుకున్న ఓ యువతిని సోదరుడే అత్యంత కడతేర్చిన దారుణ ఘటన హరియాణాలో జరిగింది. ఫరీదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో నిందితుడు పదునైన కత్తిని ఉపయోగించాడని పోలీసులు తెలిపారు.
ఇదీ జరిగింది..
ఫరీదాబాద్‌కు చెందిన 22 ఏళ్ల కుల్‌దీప్ కౌర్.. రవి అనే యువకుడిని ప్రేమించింది. విషయం తెలిసిన పెద్దలు పెళ్లికి నిరాకరించగా ఏడాది క్రితం కోర్టు వివాహం చేసుకుంది. అనంతరం తన భర్త రవితో కలిసి ఫరీదాబాద్‌లో నివసిస్తోంది. ఈ క్రమంలోనే.. కుల్దీప్ కౌర్ హత్యకు గురైంది.
అయితే యువతి సోదరుడు కర్తార్ సింగ్ ఈ హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటన జరిగినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నట్లు వివరించారు.
ఇవీ చదవండి: