ETV Bharat / bharat

ప్రశాంత్​ కిశోర్​ 'ఐ-ప్యాక్​' సభ్యుల నిర్బంధం! - త్రిపుర టీఎంసీ

ప్రశాంత్​ కిశోర్​కు చెందిన రాజకీయ సలహా సంస్థ ఐ-ప్యాక్​ బృందానికి చెందిన 22 మందిని త్రిపురలో అదుపులోకి తీసుకున్నారు స్థానిక పోలీసులు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న నేపథ్యంలో వారిని ప్రశ్నించినట్లు తెలిపారు. మరోవైపు.. ఈ చర్యను ప్రజాస్వామ్యంపై దాడిగా పేర్కొంది టీఎంసీ.

Prashant Kishore's I-PAC team held in Tripura
ప్రశాంత్​ కిషోర్​ 'ఐప్యాక్​' సభ్యుల నిర్బంధం!
author img

By

Published : Jul 26, 2021, 7:10 PM IST

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​కు చెందిన ఇండియన్​ పొలిటికల్​ యాక్షన్​ కమిటీ (ఐ-ప్యాక్​) బృందంలోని 22 మందిని నిర్బంధించారు త్రిపుర పోలీసులు. త్రిపురలో రాజకీయ పరిస్థితులు, తృణమూల్​ కాంగ్రెస్​కు మద్దతుపై అంచనా వేసేందుకు అగర్తలాలోని ఓ హోటల్​లో గత వారం రోజులుగా ఈ బృందం బసచేస్తోంది. అయితే.. వీరంతా రాష్ట్రంలో అనధికారిక సర్వేలు చేస్తూ, నకిలీ​ గుర్తింపు కార్డులతో పలువురి వాంగ్మూలాలు నమోదు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

హోటల్​లో తనిఖీలు చేస్తుండగా వారు కనిపించారని, ఆదివారం రాత్రి మొత్తం వారిని హోటల్​లో నిర్బంధించినట్లు తూర్పు అగర్తలా పోలీస్​ స్టేషన్​ ఇఛార్జి సరోజ్​ భట్టాచార్య తెలిపారు. వారిని విచారిస్తున్నట్లు చెప్పారు.

పోలీసుల తీరును తప్పుపట్టింది టీఎంసీ త్రిపుర విభాగం.

"ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. త్రిపుర నివాసిగా నేను ఆశ్చర్యానికి గురయ్యా. ఇది త్రిపుర సంస్కృతి కాదు. రాష్ట్రంలో ప్రభుత్వం పాలన సరిగా లేకపోవటం వల్ల టీఎంసీకి మద్దతు పెరిగింది. దాన్ని చూసి భాజపా భయపడుతోంది. ఆదివారం రాత్రి నుంచి ఐ-ప్యాక్​ బృందాన్ని హోటల్​లోనే నిర్బంధించారు. అయితే.. ఇది సాధారణ తనిఖీలో భాగంగానే చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. 23 మంది ఐ-ప్యాక్​ సభ్యులు గత వారం రాష్ట్రానికి వచ్చారు. పలు ప్రాంతాలను సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకున్నారు. కేవలం టీఎంసీ గురించే అడగలేదు. ఇతర పార్టీల తీరు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు."

- ఆశిష్​ లాల్​ సింగ్​, త్రిపుర టీఎంసీ అధ్యక్షుడు.

మరోవైపు.. సాధారణ తనిఖీల్లో భాగంగానే అగర్తలాలోని ఓ హోటల్​లో ఉంటున్న 22 మంది ఐ-ప్యాక్​ సభ్యులను ప్రశ్నించినట్లు చెప్పారు పశ్చిమ త్రిపుర ఎస్పీ మాణిక్​ దాస్​. టీఎంసీ వ్యాఖ్యలను ఖండించారు.

" 22 మంది బయటి వ్యక్తులు పలు ప్రాంతాల్లో తిరుగుతూ కనిపించారు. కొవిడ్​ ఆంక్షలు అమలులో ఉన్న క్రమంలో వారు ఎందుకు వచ్చారు, కారణం ఏమిటి అని తెలుసుకునేందుకు ప్రశ్నించాం. వారందరికీ సోమవారం కొవిడ్​ పరీక్షలు నిర్వహించాం. ఫలితాలు రావాల్సి ఉంది."

- మాణిక్​ దాస్​, పశ్చిమ త్రిపుర ఎస్పీ.

మరోవైపు.. ఈ అంశంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్​ సాహాను ప్రశ్నించగా.. తనకు తెలియదని సమాధానమిచ్చారు.

ఇదీ చూడండి: పీకే మరో సూపర్​ హిట్​- ఆప్​ విజయం వెనుక ఐప్యాక్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.