Farm bodies political front: పంజాబ్లో 22 రైతులు సంఘాలు కలిసి కీలక నిర్ణయం తీసుకున్నాయి. అన్నీ ఏకమై కొత్త రాజకీయ వేదిక 'సంయుక్త సమాజ్ మోర్చా'ను స్థాపించాయి. వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు రైతు సంఘం నేత హర్మీత్ సింగ్ కదియాన్ వెల్లడించారు.
ఈ సంఘాలన్నీ దిల్లీ సరిహద్దులో జరిగిన రైతు నిరసనల్లో పాల్గొన్నాయి. అయితే నిరసనల్లో మొత్తం 32 రైతుల సంఘాలు పాల్గొనగా 22 రైతుల సంఘాల మాత్రమే రాజకీయ వేదికను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, తమ మోర్చాకు ప్రజలు మద్దతు ఇవ్వాలని రైతు సంఘం నాయకుడు బల్బీర్ సింగ్ రాజెవాల్ విజ్ఞప్తి చేశారు.
Samyukta smaj morcha
మేం దూరం..
మరో వైపు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. దేశవ్యాప్తంగా భిన్న సిద్ధాంతాలు కలిగిన 400 సంస్థలతో తాము కలిసి పనిచేస్తున్నామని, రైతుల సమస్యలపైనే పోరాటం చేస్తామని స్పష్టం చేసింది. ఏడాది పాటు జరిగిన ఉద్యమం తాత్కాలికంగా మాత్రమే నిలిపివేశామని, తమ డిమాండ్లు ఇంకా నెరవేరలేదని పేర్కొంది. 2022 జనవరి 15న జరిగే సమావేశంలో చర్చించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పింది.
ఇదీ చదవండి: Farm Laws repealed: మళ్లీ తెరపైకి సాగు చట్టాలు- కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు