బిహార్‌లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో.. 21 ఏళ్ల యువతి సర్పంచ్‌గా(Bihar Panchayat Election 2021) గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. షియోహర్ జిల్లాలోని కుషాహర్ పంచాయతీ తరపున అనుష్క పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి రీతా దేవిపై 287 ఓట్ల తేడాతో(Bihar Panchayat Election 2021) గెలుపొందింది. అనుష్కకు 2,625 ఓట్లు రాగా.. రితాకు 2,338 ఓట్లు దక్కాయి. ఫలితంగా.. రాష్ట్రంలో సర్పంచ్ పదవి చేపట్టిన అత్యంత పిన్నవయస్కురాలిగా నిలిచింది.
అయితే అనుష్క మాత్రం.. ఈ క్రెడిట్ అంతా గ్రామస్థులదే అంటోంది. యువత, ముఖ్యంగా అమ్మాయిలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చింది. అనుష్కకు ఎన్నికల్లో పోటీచేయడం ఇదే (Bihar Panchayat Election 2021) తొలిసారి కావడం విశేషం.
హరియాణాలో 10వ తరగతి వరకు చదువుకున్న అనుష్క.. కర్ణాటకలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత రాజకీయాలపై ఆసక్తితో బిహార్ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొంది. తనకు ఇంకా ఉన్నత విద్య అభ్యసించాలని ఉందంటోంది ఈ యువ సర్పంచ్.
ఇదీ చూడండి : కుమార్తెను వ్యభిచారం చేయమని బలవంతం.. తల్లికి 10ఏళ్ల జైలు శిక్ష