ETV Bharat / bharat

టార్గెట్ సౌత్ ఇండియా.. 2024లో దక్షిణాదిలోని ఈ నియోజకవర్గం నుంచి మోదీ పోటీ! - తమిళనాడులో మోదీ పోటీ

Narendra Modi Lok Sabha Constituency : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసిని వదిలి దక్షిణానికి మారనున్నారనే చర్చ జోరుగా నడుస్తోంది. తమిళనాడులోని కన్యాకుమారి లేదా కోయంబత్తూర్​ లోక్​సభ స్థానం నుంచి పోటీలో దిగేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మోదీ పోటీతో దక్షిణాదిలో ఎక్కువ స్థానాలు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ.

narendra modi lok sabha constituency
narendra modi lok sabha constituency
author img

By

Published : Jul 31, 2023, 5:08 PM IST

Modi Contest From Tamilnadu : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దక్షిణాది నుంచి పోటీ చేయనున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న 'బీజేపీ కంచుకోట' వారాణాసి స్థానం నుంచి తప్పుకుని తమిళనాడుకు మారనున్నట్లు తెలుస్తోంది. పార్టీ బలంగా ఉన్న కన్యాకుమారి లేదా కోయంబత్తూర్ లోక్​సభ స్థానాల నుంచి బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు రామనాథపురం లోక్​సభ స్థానాన్ని సైతం మోదీ అభ్యర్థిత్వం కోసం పరిశీలించగా.. అక్కడ పార్టీ బలంగా లేకపోవడం వల్ల వెనుకడుగు వేస్తున్నారట. ప్రస్తుతం కన్యాకుమారి నుంచి పొన్​ రాధాకృష్ణన్, కోయంబత్తూర్​ నుంచి సీపీ రాధాకృష్ణన్​ ఎంపీలుగా ఉన్నారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ రెండు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ రెండు సీట్లలో పార్టీ బూత్​ స్థాయి నుంచి చాలా పటిష్ఠంగా ఉంది. దీంతో ఈ రెండు స్థానాల్లో ఎదో ఒకదాంట్లో మోదీని బరిలోకి దించితే ప్రయోజనం ఉంటుందని పార్టీ భావిస్తోంది. ఈ సీట్లలో దాదాపు 8 శాతం బూత్ స్థాయి ప్రతినిధులతో పార్టీ చాలా బలంగా ఉంది.

Bjp Plan For South India 2024 In Telugu : అంతకుముందు జులై 9న హైదరాబాద్​లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సంస్థాగత కార్యదర్శులు, రాష్ట్రాల అధ్యక్షులు, సీనియర్​ నాయకుల సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ఈ క్రమంలోనే కొందరు నేతలు ముస్లిం వర్గం ప్రజలు అధికంగా ఉన్న రామనాథపురం స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారు. కానీ పార్టీ చేపట్టిన సర్వేలో ఆ స్థానంలో బీజేపీ ఆశించిన స్థాయిలో బలంగా లేదని తేలింది. సరైన బూత్​ స్థాయి, నియోజకవర్గ స్థాయి వ్యవస్థ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురుకావొచ్చని చెప్పింది. దీంతో ఈ ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రామనాథపురం నుంచి ఇండియన్​ యూనియన్ ముస్లిం లీగ్​ (ఐయూఎమ్​ఎల్​) పార్టీకి చెందిన నవస్కాని ఎంపీగా కొనసాగుతున్నారు.

Bjp Plan For Tamil Nadu : మరోవైపు దక్షిణాది నుంచి పోటీ చేయాలనే ప్రతిపాదనకు ఆర్​ఎస్​ఎస్​ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీ సైతం రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలను రూపొందిస్తోంది. సంస్థాగత కార్యక్రమాల నిర్వహణతో పాటు సీనియర్ నాయకులు కూడా తరచూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీ సైతం తమిళంలోనే మాట్లాడుతూ వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తమిళ సంస్కృతి, సంప్రదాయలకు పెద్ద పీట వేస్తున్నారు. తాజాగా నూతన పార్లమెంట్​ ప్రారంభోత్సవంలో సెంగోల్​ను ప్రతిష్టించడమే ఇందుకు ఉదాహారణ. ప్రధాని మోదీకి ఉన్న ప్రజాదరణతో తమిళనాడులో పాగా వేయాలని బీజేపీ ఆశిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

అంతకుముందు కాంగ్రెస్​ నేతలు ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దక్షిణాదిలో పోటీ చేశారు. కర్ణాటకలోని చిక్కమంగళూరు నుంచి ఇందిరా, బళ్లారి నుంచి సోనియా, కేరళ వయనాడ్ నుంచి రాహుల్​ గెలుపొందారు. వీరి లాగే పార్టీ నాయకుడు ప్రధానమంత్రి మోదీని దక్షిణాది నుంచి బరిలోగి దింపేందుకు కమలం పార్టీ పావులు కదుపుతోంది.

"కన్యాకుమారి లేదా కోయంబత్తూర్ స్థానాల నుంచి ప్రధాని మోదీ పోటీ చేయడం బీజేపీతో పాటు ఆర్​ఎస్​ఎస్​కు చాలా మంచి పరిణామం. తమిళనాడులో బీజేపీ గత కొన్ని రోజులుగా చురుకుగా పనిచేస్తోంది. పార్టీ ఇప్పటికే కన్యాకుమారి, కోయంబత్తూర్ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఈ ప్లాన్​తో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఎంట్రీకి మార్గం సులభం అవుతుంది."

--సీ రాజీవ్​, సెంటర్ ఫర్ పాలసీ అండ్ డెవలప్​మెంట్​ స్టడీస్​

ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల పరాజయం అనంతరం కాషాయ పార్టీ.. తమ వ్యూహాలకు పదును పెట్టింది. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటోంది. పార్టీ జరిపిన అధ్యయనంలో ఈ రెండు రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో పార్టీ పరిస్థితి చాలా కష్టంగా ఉంటుందని తేలింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఫాలోయింగ్​తో తమిళనాడు, తెలంగాణల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ఇవీ చదవండి : ఈశాన్యం గెలుపుతో బీజేపీలో జోష్.. నెక్స్ట్​ టార్గెట్​ సౌత్

దక్షిణాదిలో పాగా వేసేందుకు భాజపా వ్యూహరచన!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.