ETV Bharat / bharat

బస్సు బోల్తా పడి ఇద్దరు మృతి.. 25 మందికి గాయాలు - జమ్ముకశ్మీర్​ రోడ్డు ప్రమాదం

Jammu and Kashmir Accident: జమ్ముకశ్మీర్​లోని ఉద్ధక్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. 25 మంది గాయపడ్డారు. మరోవైపు మధ్యప్రదేశ్​లో రోడ్డు పక్కన ఉన్న వారిపై ట్రక్కు దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

accident
యాక్సిడెంట్
author img

By

Published : Apr 21, 2022, 4:21 AM IST

Jammu and Kashmir Accident: బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో 25 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం జమ్ముకశ్మీర్​ ఉద్దక్​ ప్రాంతంలోని రామ్​నగర్​ వద్ద జరిగింది. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా.. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని ఉధమ్​పుర్​ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కోగెర్​మార్గ్​కు వెళ్తుండగా ఈ బస్సు ప్రమాదానికి గురైందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Jammu and Kashmir Accident
బోల్తా పడిన బస్సు

Dumper Truck Accident: మధ్యప్రదేశ్​లోని ఇందోర్​లో మరో దుర్ఘటన జరిగింది. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న ఓ ట్రక్కు రోడ్డు పక్కన ఉన్న జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. "మృతులు గబ్రు యాదవ్, అనితా రాఠోడ్, సారికాలుగా గుర్తించాము. ఖర్​గోన్​కు వెళ్లాల్సిన వీరు రోడ్డు పక్కనే ఉన్న గార్డెన్​ వద్ద కూర్చోని భోజనం చేస్తుండగా ట్రక్కు దూసుకొచ్చింది. ఈ క్రమంలో ఇద్దరు అక్కడిక్కడే చనిపోగా.. మరొకరు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు" అని అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న డ్రైవర్​ కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి: అప్పటివరకు పెళ్లిలో సరదా సరదాగా.. కాసేపటికే ఆరుగురు శవాలై...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.