ETV Bharat / bharat

'భోపాల్ గ్యాస్' బాధితులకు అదనపు పరిహారం లేనట్లే.. కేంద్రం అభ్యర్థనకు సుప్రీం నో - భోపాల్ దుర్ఘటన సుప్రీంకోర్టు కేసు

భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు అదనపు పరిహారం కోరుతూ కేంద్ర ప్రభుత్వం వేసిన క్యూరేటివ్ పిటిషన్​ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఐదు దశాబ్దాల తర్వాత పిటిషన్ వేయడానికి సరైన కారణాలు కనిపించడం లేదని పేర్కొంది.

1984-bhopal-gas-tragedy
1984-bhopal-gas-tragedy
author img

By

Published : Mar 14, 2023, 11:10 AM IST

Updated : Mar 14, 2023, 11:55 AM IST

భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు అదనపు పరిహారం ఇప్పించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్​ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 1984లో జరిగిన ఈ ఘటనలో బాధితులకు.. అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ నుంచి మరింత పరిహారం ఇప్పించే ప్రయత్నంలో భాగంగా కేంద్రం చేసిన అభ్యర్థనను సుప్రీం తోసిపుచ్చింది. భోపాల్ గ్యాస్ బాధితుల కోసం ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ వద్ద రూ.50 కోట్లు ఉన్నాయని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఏవైనా పెండింగ్ క్లెయిమ్​లు ఉంటే ఆ నిధులతో పరిష్కరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ప్రస్తుతం యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్.. డౌ కెమికల్స్ యాజమాన్యంలో ఉంది.

యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ సంస్థను టేకోవర్ చేసిన కంపెనీ నుంచి రూ.7,844 కోట్ల పరిహారం వసూలు చేసేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టు క్యూరేటివ్ పిటిషన్​లో కేంద్రం కోరింది. గ్యాస్ దుర్ఘటన బాధితులకు మరింత సాయం అందించడం కోసం ఈ మేరకు పిటిషన్ వేసింది. దీనిపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఐదు దశాబ్దాల తర్వాత ఈ సమస్యను తిరిగి లేవనెత్తడం వెనక సరైన కారణాలు కనిపించడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై దాఖలైన క్యూరేటివ్ పిటిషన్​ను తాము ఆమోదించలేమని స్పష్టం చేసింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జేకే మహేశ్వర్​లు ఉన్నారు. కేంద్రం క్యూరేటివ్ పిటిషన్​పై జనవరి 12న తన తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు తాజాగా దాన్ని చదివి వినిపించింది.

ఏంటీ గ్యాస్ దుర్ఘటన?
1984 డిసెంబర్ 2, 3 తేదీల మధ్య రాత్రుల్లో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి విష వాయువులు వెలువడ్డాయి. మిథైల్ ఐసోసైనేట్ అనే గ్యాస్ లీక్ కావడం వల్ల ఆ ఫ్యాక్టరీకి సమీపంలో ఉన్న వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య 3వేలకు పైగా నమోదైంది. లక్ష మందికి పైగా ఈ విషవాయువుల ప్రభావానికి గురయ్యారు. ఈ కేసులో.. 1989లో యూనియర్ కార్బైడ్ కార్పొరేషన్ సంస్థ నుంచి భారత ప్రభుత్వం రూ.715 కోట్ల పరిహారం రాబట్టింది. తాజాగా మరింత పరిహారం కోసం క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసింది.

సుప్రీంకోర్టు తీర్పులపై సమీక్ష కోసం ఉండే చివరి అవకాశమే క్యూరేటివ్ పిటిషన్. రివ్యూ పిటిషన్​ను సైతం సుప్రీంకోర్టు తిరస్కరిస్తే.. చివరి ప్రయత్నంగా క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. అయితే, భోపాల్ గ్యాస్ కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయలేదు. పరిహారం చెల్లించాలన్న అప్పటి తీర్పును సవాల్ చేయకుండా.. కేవలం పరిహారం మొత్తాన్ని పెంచాలని కోరుతూ పిటిషన్ వేసింది. ఇప్పుడు దీన్నే సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Last Updated : Mar 14, 2023, 11:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.