దేశంలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య (Coronavirus update) మళ్లీ పెరిగింది. కొత్తగా 18,870 కరోనా కేసులు (Coronavirus India) నమోదయ్యాయి. మరో 28,178 మంది వైరస్(Corona update) నుంచి కోలుకున్నారు. ఫలితంగా మొత్తం యాక్టివ్ కేసులు సంఖ్య తగ్గింది. మరో 378 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు: 3,37,16,451
- మొత్తం మరణాలు: 4,47,751
- మొత్తం కోలుకున్నవారు: 3,29,86,180
- యాక్టివ్ కేసులు: 2,82,520
కేరళలో కరోనా కేసులు(Kerala Corona Update) తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో 11,196 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 149 మంది మహమ్మారి ధాటికి మృతిచెందారు. మహారాష్ట్ర కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ కొవిడ్ కేసులు ఓ మోస్తారుగా నమోదవుతున్నాయి.
టెస్టులు..
సెప్టెంబర్ 28న మొత్తం 15,04,713 కరోనా టెస్టులు(Testing update for covid-19) నిర్వహించారు. మొత్తం కొవిడ్ పరీక్షల సంఖ్య 56,74,50,185కు చేరింది.
టీకాల పంపిణీ..
దేశంలో ఇప్పటివరకు 87,66,63,490 టీకా డోసులను (covid vaccination) పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మంగళవారం ఒక్కరోజే 54,13,332 వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు అందించినట్లు తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా కేసుల సంఖ్య (Global corona virus update) మళ్లీ పెరిగింది. కొత్తగా 4,26,569 మందికి కొవిడ్ (Corona update) పాజిటివ్‌గా తేలింది. వైరస్ ధాటికి మరో 7,929 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 23,35,48,728కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 47,78,699కి పెరిగింది.
వివిధ దేశాల్లో కొత్త కేసులు..
- అమెరికా - 1,05,633
- బ్రిటన్ - 34,526
- టర్కీ - 28,892
- రష్యా - 21,559
- బ్రెజిల్ - 15,395
- ఇరాన్ - 11,701
ఇదీ చూడండి: World Heart Day:గుండె వ్యాధుల తీవ్రత అధికంగా భారత్‌లోనే!