రాజస్థాన్ దుంగార్‌పుర్ జిల్లాలోని సియోమ్ నదిపై ఉన్న ఓ బ్రిడ్జ్ కింద భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించారు. సుమారు 186 కిలోల జిలెటిన్ స్టిక్స్‌తో నింపిన ఏడు బస్తాలు పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. వీటిని మైనింగ్లలో బ్లాస్టింగ్‌లకు ఉపయోగిస్తారు. ఉదయ్‌పుర్ రైల్వేట్రాక్‌పై శనివారం- ఆదివారం రాత్రి పేలుడు జరిగిన ప్రాంతానికి 70 కిలోమీటర్ల దూరంలో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి.
"స్థానికుల నుంచి సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాం. అక్కడ లోతులేని నీటిలో ఈ బస్తాలు దొరికాయి" అని పోలీసు అధికారి సవాంగ్ సింగ్ అన్నారు. ఈ ప్రాంతం గిరిజన ప్రాంతంలో ఉందని, చుట్టూ అనేక గనులున్నాయని చెప్పారు. అయితే "మైనింగ్‌లో ఉపయోగించిన పాత జిలెటిన్ స్టాక్‌ను ఎవరో అక్కడ పడేసి ఉంటారు. దీనిపై పూర్తిగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నాం" అని ఉదయ్‌పుర్ ఇన్స్పెక్టర్ జనరల్ ప్రఫుల్ల కుమార్ తెలిపారు. అయితే రైల్వేట్రాక్‌పై ఉపయోగించిన పేలుడు పదార్థాలు, ప్రస్తుతం దొరికిన జిలెటిన్ స్టిక్స్ వేర్వేరు అని పోలీసులు తెలిపారు. ఈ రెండు ఘటనలకు సంబంధం లేదని చెప్పారు.
ఇవీ చదవండి:'రూ.50వేలు ఇవ్వు.. లేదంటే ఆమెను చంపేస్తా'.. తల్లికి 4వ తరగతి విద్యార్థి లేఖ
మద్యం తాగొచ్చి భార్యతో గొడవ.. అడ్డుకున్న కూతురిని కాల్చి చంపిన తండ్రి