దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య(Coronavirus update) 209 రోజుల కనిష్ఠానికి దిగొచ్చింది. కొత్తగా 18,346 మందికి కొవిడ్ (Covid cases in India) పాజిటివ్‌గా తేలింది. మరో 263 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 29,639 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఫలితంగా రికవరీ రేటు 97.93కు చేరింది.
- మొత్తం కేసులు: 3,38,53,048
- మొత్తం మరణాలు: 4,49,206
- మొత్తం కోలుకున్నవారు: 3,31,50,886
- యాక్టివ్ కేసులు: 2,52,902
పరీక్షలు
అక్టోబరు 4న మొత్తం11,41,642 కొవిడ్ టెస్టులు(Testing update for covid-19) నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో మొత్తం కొవిడ్ పరీక్షల సంఖ్య 57,53,94,042కు చేరింది.
టీకాల పంపిణీ..
దేశంలో ఇప్పటివరకు 91,54,65,826 టీకా డోసులను(covid vaccination) పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. సోమవారం ఒక్కరోజే 72,51,419 వ్యాక్సిన్ డోసులను లబ్దిదారులకు అందించినట్లు తెలిపింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రపంచ దేశాల్లో..
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విస్తరణ (Global corona virus update) కొనసాగుతోంది. కొత్తగా 3,39,108 మందికి కరోనా (Corona update) సోకినట్లు తేలింది. మహమ్మారి ధాటికి మరో 4,808 మంది చనిపోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 23,61,65,564 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 4,822,761కి పెరిగింది.
ఆయా దేశాల్లో కొత్త కేసులు..
- అమెరికా - 72,947
- బ్రిటన్ - 35,077
- టర్కీ - 28,810
- రష్యా - 25,781
- బ్రెజిల్ - 10,425
- ఇరాన్ - 14,607
ఇదీ చూడండి: 'ఈ నెలలోనే థర్డ్ వేవ్.. జనవరి-ఏప్రిల్ మధ్య తీవ్రస్థాయికి!'