ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని రాజ్ ఆస్పత్రి వైద్యులు 92ఏళ్ల వృద్ధురాలి కడపులోంచి 15 కేజీల ట్యూమర్‌ను తొలగించారు. ఆమె వయసు దృష్ట్యా ముందు శస్త్రచికిత్స చేసేందుకు సందేహించామని.. కానీ ఆరోగ్యస్థితి మరింత క్షీణిస్తుండటం వల్ల కణతిని తొలగించామన్నారు.
డాక్టర్ పీకే రైనా, డాక్టర్ ఆశీష్ కుమార్ మోదీ సహా 8 మంది సభ్యుల వైద్య బృందం శుక్రవారం ఈ శస్త్రచికిత్సను నిర్వహించింది.
ఈ ఆపరేషన్ చాలా క్లిష్టమైనదని ఆస్పత్రి ఛైర్మన్ జోగేష్ గంభీర్ అన్నారు. ఆధునిక సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్యులు ఉండటం వల్ల ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
"కొన్ని నెలలుగా ఆమె ట్యూమర్‌తో బాధపడుతోంది. కానీ ఇదివరకు సంప్రదించిన వైద్యులంతా తన వయసు కారణంగా శస్త్రచికిత్సకు నిరాకరించారు. రాజ్ ఆస్పత్రిని సంప్రదించగా వారు పరీక్షలు చేసి, తక్షణమే శస్త్రచికిత్స చేయాలన్నారు."
-రోగి బంధువులు
ఈ సందర్భంగా రోగి బంధువులు వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి : కొవిడ్ వచ్చి పోయింది.. మరి టీకా వేయించుకోవాలా?