ETV Bharat / bharat

మైనర్ ఆయాపై చిత్రహింసలు.. వాతలు పెడుతూ, బ్లేడులతో కోస్తూ.. - మైనర్ ఆయాను హింసించిన దంపతులు న్యూస్

14 ఏళ్ల బాలికను పనిలో పెట్టుకుని.. ఓ దంపతులు చిత్రహింసలకు గురిచేశారు. ఈ అమానవీయ ఘటన హరియాణాలోని గురుగ్రామ్​లో వెలుగులోకి వచ్చింది.

girl tortured by couple in haryana
మైనర్ ఆయాపై చిత్రహింసలు
author img

By

Published : Feb 9, 2023, 9:29 AM IST

పేదరికం ఆ బాలికను పాఠశాలకు బదులు పనికి వెళ్లేలా చేసింది. ఆటపాటలతో సరదాగా సాగాల్సిన ఆమె జీవితం మరో చిన్నారి బాగోగులు చూసే చిట్టి ఆయాగా మారింది. అదే పని ఆమెకు నరకం చూపించింది. హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన మనీశ్‌ ఖట్టర్‌ (36), కమల్‌జీత్‌ కౌర్‌ (34) దంపతులకు మూడున్నరేళ్ల కుమార్తె ఉంది. ఇద్దరూ ఉద్యోగులు కావడంతో అయిదు నెలల క్రితం ఓ సంస్థ ద్వారా ఝార్ఖండ్‌లోని రాంచీ నుంచి 14 ఏళ్ల బాలికను ఇంటి సహాయకురాలిగా నియమించుకున్నారు.

పనిలో చేరిన కొద్దిరోజులకే బాలికకు వేధింపులు మొదలయ్యాయి. సరిగా పని చేయడం లేదని ఆమెను కొడుతూ, వాతలు పెడుతూ, బ్లేడుతో చేతులపై కోస్తూ హింసించారు. లైంగికంగానూ వేధించారు. భోజనం కూడా పెట్టకపోవడం వల్ల ఇంట్లో ఉండే చెత్తడబ్బాలో పడేసిన మిగులు పదార్థాలు తిని ఆ బాలిక పొట్ట నింపుకొనేది. కౌర్‌ దంపతుల చేతిలో బాలిక నరకం అనుభవిస్తున్న విషయాన్ని తెలుసుకున్న దీపికా నారాయణ్‌ భరద్వాజ్‌ అనే సామాజిక కార్యకర్త, సఖి కేంద్రం పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల ఈ వ్యవహారం బయటపడింది. బుధవారం కౌర్‌ దంపతులను అరెస్టు చేసిన పోలీసులు బాలికను ఎన్జీవోకు అప్పగించారు. తీవ్రగాయాలతో ఉన్న బాలికకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు దీపికా తెలిపారు. సిటీ కోర్టు మనీశ్‌ ఖట్టర్‌కు పోలీసు రిమాండ్‌, కౌర్‌కు జుడీషియల్‌ కస్టడీ విధించింది. మైనర్ బాలికపై జరిపిన అకృత్యాలకు కమల్​జిత్​ పనిచేస్తున్న పీఆర్ సంస్థ ఉద్యోగం నుంచి ఆమెను తొలగించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.