ETV Bharat / bharat

14 ఏళ్ల బాలికపై క్రూరత్వం.. 13 మంది కలిసి.. - ముంబయిలో అత్యాచారం

రైల్వే స్టేషన్​కు ఒంటరిగా చేరుకున్న ఓ 14 ఏళ్ల బాలికపై కామాంధులు కన్నేశారు. ఆమెపై రైల్వే ఉద్యోగి సహా 13 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ముంబయిలో ఈ దారుణ ఘటన జరిగింది.

rape on minor
మైనర్​పై అత్యాచారం
author img

By

Published : Sep 8, 2021, 8:43 PM IST

పంజాబ్​ చండీగఢ్​లో(Chandigarh News) షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. 13 మంది కామాంధుల చేతిలో నలిగిపోయిన 14 ఏళ్ల బాలికను రైల్వే పోలీసులు రక్షించారు. అనంతరం.. చైల్డ్​ హెల్ప్​లైన్​ అధికారులకు అప్పగించారు. బాధిత బాలికతో.. చైల్డ్​ హెల్ప్​లైన్​ డైరెక్టర్​ సంగీతా జంద్​ మాట్లాడగా.. తనపై జరిగిన దారుణాన్ని బాలిక బయటపెట్టింది.

అసలేం జరిగింది?

పుణెకు చెందిన బాలిక.. తన స్నేహితునితో కలిసి చండీగఢ్​కు వెళ్లాలని ప్రయత్నించింది. ముంబయి రైల్వే స్టేషన్(Mumbai Railway Station)​లో తనను కలుస్తానని ఆమె స్నేహితుడు చెప్పాడు. దాంతో తల్లిదండ్రులకు చెప్పకుండానే.. ముంబయి రైల్వే స్టేషన్​కు చేరుకుంది ఆ బాలిక. అయితే.. ఎంతవెతికినా రైల్వే స్టేషన్​లో తన స్నేహితుడు ఆమెకు కనిపించలేదు. ఈ క్రమంలో ఓ ఆటోడ్రైవర్​.. రైల్వే స్టేషన్​ బయట ఆమె స్నేహితుడు ఎదురు చూస్తున్నాడని నమ్మించి, ఆటోలో తీసుకువెళ్లాడు.

రైల్వే స్టేషన్​ నుంచి బయటకు వచ్చిన తర్వాత బాలికతో ఆటోడ్రైవర్​ మద్యం తాగించాడు. పథకం ప్రకారం ఓ ప్రదేశానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెపై 12 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం.. బాధితురాలిని ఓ రైల్వే ఉద్యోగికి అప్పగించి, ఆ ఆటోడ్రైవర్​ పరారయ్యాడు. అయితే.. సదరు ఉద్యోగి కూడా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత.. చండీగఢ్ వెళ్లేందుకు ఆమెకు రైలు టికెట్​ ఇచ్చాడని అధికారులు తెలిపారు. చండీగఢ్​ రైల్వే స్టేషన్​కు ఓ బాలుడితో చేరుకున్న ఆ బాలికను రైల్వే పోలీసులు చేరదీసి, చైల్డ్ హెల్ప్​లైన్​ అధికారులకు సమాచారం అందించారు.

పుణె పోలీసులను చండీగఢ్​ పోలీసులు సంప్రదించగా.. ఇక్కడ ఓ బాలిక అదృశ్యం కేసు నమోదైనట్లు వారు తెలుసుకున్నారు. దాంతో బాలికను.. పోలీసులు పుణె నగరానికి తిరిగి తీసుకువచ్చారు. ఇప్పటికే.. ఈ కేసులో 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: 'ఎన్‌డీఏలో మహిళల ప్రవేశానికి గ్రీన్​ సిగ్నల్​​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.