Omicron Suspects In India: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకిందన్న అనుమానంతో.. దిల్లీలోని లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో ఇప్పటివరకు 12 మంది చేరినట్లు అధికారులు తెలిపారు. గురువారం ఎనిమిది మంది చేరగా.. శుక్రవారం మరో నలుగురు చేరినట్లు పేర్కొన్నారు. శుక్రవారం చేరిన నలుగురు అనుమానితుల్లో యూకే నుంచి ఇద్దరు.. ఫ్రాన్స్, నెథర్లాండ్స్ నుంచి ఒక్కొక్కరు భారత్‌కు వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు. అందరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు.
Omicron India Cases: కర్ణాటకలోని బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసినట్లు కేంద్రం గురువారం అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 11, 20వ తేదీల్లో బెంగళూరుకు వచ్చిన వారిలో ఒమిక్రాన్ నిర్ధరణ అయినట్లు వెల్లడించారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్. వీరిలో ఒకరి వయసు 66ఏళ్లు కాగా.. మరొకరి వయసు 46 ఏళ్లని తెలిపారు. వీరిద్దరికీ తొలుత కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ కావడం వల్ల ఆ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేశామని, వారిద్దరిలో ఒమిక్రాన్ ఉన్నట్టు ఇన్‌సాకాగ్ నిర్ధరించినట్లు వెల్లడించారు. బాధితుల్లో తీవ్ర లక్షణాలు కనిపించలేదని తెలిపారు.
WHO Omicron News: దక్షిణాఫ్రికా దేశాల్లో కొత్తగా వెలుగుచూసిన బీ.1.1.529 వేరియంట్‌ను ఇప్పటికే ఆందోళనకర రకంగా ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ. నవంబరు 26న దీనికి 'ఒమిక్రాన్' అని నామకరణం చేసింది.
ఇప్పటివరకు 23 దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ తెలిపారు. ఒమిక్రాన్ భయంతో ఇప్పటికే చాలా దేశాలు ప్రయాణ ఆంక్షలను విధించినట్లు వివరించారు.
ఇదీ చూడండి: ఒమిక్రాన్ భయాలు- దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన కుటుంబానికి కరోనా