బంగాల్ ఆసన్సోల్లో(West Bengal Asansol news) దొంగలు రెచ్చిపోయారు. ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ కార్యాలయంలోకి(Robbery in Muthoot Finance) తుపాకులతో దూసుకువచ్చి, అందినకాడికి దోచుకుని ఉడాయించారు.
అసలేమైంది?
ఆసన్సోల్లోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలోకి(Robbery in Muthoot Finance) వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు.. ఉద్యోగులను తుపాకీలతో బెదిరించారు. అనంతరం లాకర్లో నుంచి బంగారం, నగదు ఎత్తుకెళ్లారని పోలీసులు చెప్పారు. శనివారం ఉదయం ఈ ఘటన జరిగిందిని పేర్కొన్నారు.
"ఓ వ్యక్తి కార్యాలయంలోకి దూసుకువచ్చి, మాపై తుపాకీ గురిపెట్టాడు. ఆ వెంటనే మరో ముగ్గురు దుండగులు వచ్చి, సెక్యూరిటీ గార్డును కొట్టారు. వాళ్లు 12 కిలోల బంగారం, రూ.3 లక్షల నగదు ఎత్తుకెళ్లారు." అని సంస్థలో పని చేసే ఉద్యోగి సోనాలీ తెలిపారు.
ఇదీ చూడండి: సొంతిల్లు, సొంత వాహనం లేని ముఖ్యమంత్రి