Heroin seized in Amritsar: పంజాబ్‌లోని అట్టారీ సరిహద్దు గుండా భారత్‌లోకి తరలిస్తున్న సుమారు 100 కేజీల హెరాయిన్‌ను పట్టుకున్నారు కస్టమ్స్ విభాగం అధికారులు. అఫ్గానిస్థాన్ నుంచి ములేథి మూలికల్లో దాచి తరలిస్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ సుమారు రూ.700 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. దిల్లీకి చెందిన ఓ వ్యక్తి అఫ్గానిస్థాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న ములేథి మూలికల్లో దాచి హెరాయిన్ తరలిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది కస్టమ్స్ విభాగం. అట్టారీలోని చెక్‌పోస్ట్ వద్ద ఎక్స్-రే స్కానింగ్ చేస్తుండగా దీనిని గుర్తించినట్లు వెల్లడించింది. ఎక్స్-రే చిత్రాల్లో కొన్ని అనుమానిత గుర్తులు కనిపించినట్లు అధికారులు తెలిపారు.
" బ్యాగులను కస్టమ్స్ అధికారులు తెరిచి చూడగా.. అందులో ములేథీ కాకుండా కొన్ని స్థూపాకారంలోని చిన్న చెక్క దుంగలు కనిపించాయి. కర్ర పొట్టుతో హెరాయిన్ కలిపిన మిశ్రమంతో వాటిని నింపినట్లుగా కనిపించింది. కర్ర దుంగలను పగలగొట్టగా వాటి లోపల పౌడర్ నింపినట్లు తెలిసింది. ఆ పౌడర్‌ను కస్టమ్స్, బీఎస్ఎఫ్ అధికారులు వేరువేరుగా పరీక్షించారు. ఇరు పరీక్షల్లో అది మత్తుపదార్థంగా తేలింది. మొత్తం మూలిక దుంగలు 475 కిలోలు ఉండగా 102 కిలోల హెరాయిన్ బయటపడింది. దాని విలువ రూ.700 కోట్లు ఉంటుంది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది."
- కస్టమ్స్ అధికారి.
అట్టారీ సరిహద్దులోని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్(ఐసీపీ) గుండా అఫ్గానిస్థాన్ నుంచి డ్రైఫ్రూట్స్, పండ్లు, మూలికలు భారత్‌కు దిగుమతి అవుతుంటాయి. అయితే, 2021 ఆగస్టులో అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్న క్రమంలో దిగుమతి అవుతున్న అన్ని కార్గో పార్సిళ్లను క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2019, జూన్‌లో అట్టారీలోని ఐసీపీ వద్ద 532.63 కిలోల డ్రగ్స్‌ను సీజ్ చేసిన తర్వాత ఆ స్థాయిలో పట్టుబడటం ఇదే తొలిసారి.
ఇదీ చూడండి: గుట్టుగా రూ.10 నకిలీ నాణేల ముద్రణ.. ఐదుగురు అరెస్ట్