ETV Bharat / bharat

100 రోజులు.. 100 కార్యక్రమాలు... యూపీ కోసం భాజపా మాస్టర్ ప్లాన్ - యూపీ భాజపా వార్తలు

ఉత్తర్​ప్రదేశ్​లో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా భాజపా మాస్టర్​ ప్లాన్ సిద్ధం చేస్తోంది(up bjp news). రాష్ట్రంలోని ప్రతి ఓటర్​కు చేరువయ్యేలా ఎన్నికలకు ముందు 100 రోజుల పాటు 100 కార్యక్రమాలు చేపట్టనుంది(up assembly election 2022). మండల, నియోజకవర్గ స్థాయిలో రోజుకో ప్రోగ్రామ్​ నిర్వహించనుంది.

100-programmes-in-100-days-on-bjps-agenda
భాజపా మాస్టర్ ప్లాన్
author img

By

Published : Oct 11, 2021, 5:58 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో గత అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన భాజపా(up bjp news).. మరోసారి అధికారంలోకి రావాలని కృత నిశ్చయంతో ఉంది. రాష్ట్రంలోని ఓటర్లకు మరింత చేరువయ్యేందుకు ఓ మాస్టర్​ ప్లాన్​ను సిద్ధం చేస్తోంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు(up assembly election 2022) సరిగ్గా 100 రోజుల ముందు నుంచి రోజుకొకటి చొప్పున 100 కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల(uttar pradesh election 2022) అజెండా సిద్ధం చేసిన యూపీ భాజపా నాయకులు.. దీని ఆమోదం కోసం దిల్లీలో పార్టీ అధిష్ఠానంతో సమావేశమయ్యేందుకు వెళ్లారు.

ఈ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా యూపీలో భాజపా ప్రభుత్వం(uttar pradesh bjp) చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయనున్నారు భాజపా కార్యకర్తలు. ప్రతి మండలం, అసెంబ్లీ నియోజకవర్గంలో రోజుకో కార్యక్రమం నిర్వహించనున్నారు. భాజపాలో వివిధ సంఘాలకు ఒక్కో దానికి కొన్ని రోజులు కేటాయించి బూత్​ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.

ఆదివారం జరిగిన సమావేశంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ అజెండాను ఖరారు చేశారు. దిల్లీలో పార్టీ అధిష్ఠానంతో జరిగే భేటీలో అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలతో పాటు హిందూ వర్గం ఓట్లు చీల్చేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రణాళికలను పార్టీ నాయకులు సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది.

ఆ స్థానాల్లో ముస్లిం ఓటర్లే అధికం..

ఉత్తర్​ప్రదేశ్​లో(uttar pradesh news ) 110 అసెంబ్లీ స్థానాల్లో ముస్లిం ఓటర్లు 30-39 శాతం ఉన్నారు. మరో 44 స్థానాల్లో ఆ సంఖ్య 40-49 శాతంగా ఉంది. వీటితో పాటు ముస్లిం ఓట్లు 50-65 శాతం ఉన్న మరో 11 సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించలేకపోయిన 81 స్థానాలపైనా భాజపా ఈసారి ప్రత్యేక దృష్టి సారించనుంది.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాలకు 312 సీట్లు కైవసం చేసుకుంది భాజపా(uttar pradesh bjp news). 39.67శాతం ఓట్లు సాధించింది. ఎస్పీ 47, బీఎస్పీ 19, కాంగ్రెస్​ 7 స్థానాలకే పరిమితమయ్యాయి.

వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్యకాలంలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు(up assembly election 2022) జరగనున్నాయి. మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని భాజపా, దాన్ని గద్దె దించాలని ప్రతిపక్షాలు పట్టుదలతో ఉన్నాయి.

ఇదీ చదవండి: భాజపాకు షాక్​.. కాంగ్రెస్​లోకి ఉత్తరాఖండ్​ మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.