ETV Bharat / bharat

ఎయిమ్స్​ వైద్యుల నిర్లక్ష్యం.. హెచ్​ఐవీ బ్లడ్​తో బాలిక మృతి

వైద్యుల నిర్లక్ష్యానికి ఓ 10 ఏళ్ల బాలిక బలైంది. హెచ్​ఐవీ రక్తాన్ని ఎక్కించడం వల్ల ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో జరిగింది.

aiims
బాలిక మృతి
author img

By

Published : Mar 16, 2022, 9:10 AM IST

మధ్యప్రదేశ్​లోని భోపాల్​ ఎయిమ్స్​ ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ 10 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు హెచ్​ఐవీ సోకిన రక్తం ఎక్కించడమే ఇందుకు కారణం. ఈనెల 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కుటుంబసభ్యుల వివరాల ప్రకారం..

భోపాల్​లోని ఆదంపుర్​కు చెందిన బాలిక అనారోగ్యానికి గురైంది. ఈనెల 11న అక్కడే ఉన్న ఎయిమ్స్​లో చేరింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు రక్తం ఎక్కించాలని సూచించారు. ఈ క్రమంలో ఎయిమ్స్​ బ్లడ్​ బ్యాంక్​ నుంచి డొనేట్​ చేసిన బ్లడ్​ను తెచ్చిన వైద్యులు ఆమెకు ఎక్కించారు. అయితే రక్తం శరీరంలోకి వెళ్లిన కొద్దిసేపటికే ఆమె మృతిచెందింది. బాలిక మృతికి కారణం తెలుసుకునేందుకు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు ఇచ్చిన రక్తంలో హెచ్​ఐవీ ఉన్నట్లు తేలింది.

సిబ్బంది తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు బ్లడ్​ శాంపిల్​ మార్చేందుకు ప్రయత్నించారని బాలిక తండ్రి ఆరోపించారు. దీనిపై ఆస్పత్రి వద్ద నిరసన వ్యక్తం చేసిన బాధిత కుటుంబీకులు.. ఈ విషయంపై ప్రధాన మంత్రికి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి : బ్యాటరీ​ పేలి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.