ETV Bharat / bharat

స్మార్ట్​ కిడ్.. 10 ఏళ్ల వయసులోనే లాయర్ల కోసం యాప్​ తయారీ - పదేళ్ల బాలుడి యాప్​ తయారీ

E-Attorney App: ఆటపాటలతో సరదాగా గడపాల్సిన వయసులో ఓ పదేళ్ల బాలుడు లాయర్ల కోసం ప్రత్యేక యాప్​ను తయారు చేశాడు. 'ఈ-అటార్నీ' పేరుతో రూపొందించిన ఈ యాప్​ ద్వారా లాయర్లు వివిధ కేసుల వివరాలు పొందుపరచుకోవచ్చని చెప్పుకొచ్చాడు ఆ బాలుడు.

E-Attorney App
ఈ-అటార్నీ
author img

By

Published : Jan 28, 2022, 2:45 PM IST

E-Attorney App: చదువు, ఆటపాటలతో కాలం గడిపే వయసు అది. వీడియో గేమ్స్​తో కుస్తీ పడే వయసులో ఈ బుడతడు కోడింగ్​వైపు దృష్టిసారించాడు. కేవలం పదేళ్ల ప్రాయంలోనే లాయర్ల కోసం ప్రత్యేకమైన యాప్​ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బెంగళూరుకు చెందిన ఆర్​.కనిష్కర్​ 'ఈ-అటార్నీ' అనే యాప్​ తయారుచేశాడు.

కనిష్కర్​ తండ్రి ఓ లాయర్. వివిధ కేసు ఫైళ్లను భద్రపరుచుకోవడంలో తన తండ్రి పడుతున్న ఇబ్బందులను గుర్తించిన కనిష్కర్​.. ఈ యాప్​ను తయారు చేయాలని భావించాడు. అప్పటికే ఓ ప్రైవేట్ సంస్థ వద్ద కోడింగ్​ నేర్చుకుంటున్నాడు. దీంతో యాప్​ తయారుచేయడం అతనికి సులభమైంది. మొదట దీనిని ఓ చిన్న యాప్​గా కనిష్కర్​ రూపకల్పన చేసినా.. ఆ యాప్​ ప్రాధాన్యం తెలుసుకున్న వైట్​హ్యాట్​ సంస్థ అతడిని ప్రోత్సహించింది.

E-Attorney App
కనిష్కర్​ తయారు చేసిన 'ఈ-అటార్నీ' యాప్​

"పని ఒత్తిడి కారణంగా నాన్న ఇంటికి చాలా ఆలస్యంగా వచ్చేవారు. ఆయన ఆఫీసుకు నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను. కేసు డాక్యుమెంట్లు పొందుపరచడం కోసం ఆయన జూనియర్లు తర్జనభర్జన పడుతుంటారు. దీని వల్ల పని మరింత ఆలస్యం అవుతుంది. అందుకే లాయర్లకు పని సులువు అయ్యేలా ఓ యాప్​ తయారు చేయాలని భావించాను."

-ఆర్​. కనిష్కర్​, 'ఈ-అటార్నీ' రూపకర్త

ఈ యాప్​ ద్వారా లాయర్లు తమ క్లయింట్లకు సంబంధించిన వివిధ డాక్యుమెంట్లు, కేసు వివరాలను సేకరించి పొందుపరుచుకోవచ్చు. ఈ యాప్​కు తమ క్లయింట్లను కనెక్ట్​ చేయడం ద్వారా ఇందులోంచే వారిని సంప్రదించొచ్చు. 'ఈ-అటార్నీ' యాప్​లో సమాచారం లీక్​ అయ్యే అవకాశమే లేదని అంటున్నాడు యాప్​ రూపకర్త కనిష్కర్​.

E-Attorney App
యాప్​ తయారు చేసిన కనిష్కర్​

ఈ యాప్​ రూపొందించినందుకు ప్రోత్సాహకంగా తనకు పాఠశాల యాజమాన్యం స్కాలర్​షిప్​ అందిస్తోందన్నాడు కనిష్కర్​. 'ఆన్​లైన్​ సొల్యూషన్​' అనే సంస్థ సాయంతో ఈ యాప్​కు మరింత సాంకేతికత ఉపయోగించి పకడ్బందీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్​ ఉచితం!

ఇదీ చూడండి : 'మా నాన్నను గెలిపించండి'.. ఎన్నికల ప్రచారంలో ఏడేళ్ల బాలిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.