ETV Bharat / bharat

ఘోరం.. కరెంట్​ షాక్​తో 10 మంది మృతి.. వ్యాన్​లోని డీజే సిస్టమ్​ వల్లే! - విద్యుత్ షాక్​తో 1ం మంది మృతి

Electrocution in West Bengal : కరెంట్ షాక్ తగిలి వ్యాన్​లో ప్రయాణిస్తున్న 10 మంది మరణించారు. 16 మంది గాయపడ్డారు. ఈ ఘటన బంగాల్​ కూచ్ బెహార్​లో జరిగింది. వ్యాన్​ వెనుక భాగంలో ఉన్న డీజే సిస్టమ్ జనరేటర్​ వైరింగ్​లో సమస్యలే ఈ దుర్ఘటనకు కారణమని తెలిసింది.

electrocution news in west bengal
విద్యుత్​ షాక్
author img

By

Published : Aug 1, 2022, 6:58 AM IST

Updated : Aug 1, 2022, 7:30 AM IST

Electrocution in West Bengal : వినోదం కోసం వ్యాన్​లో ఏర్పాటు చేసిన డీజే సిస్టమ్.. 10 మంది ప్రాణాలు బలిగొంది. బంగాల్​లోని కూచ్​ బెహార్​లో ఆదివారం అర్ధరాత్రి జరిగిందీ ఘటన. కరెంట్​ షాక్​తో గాయపడిన మరో 16 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సీతల్​కుచి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన 27 మంది వ్యాన్​లో ఆదివారం జల్పేశ్​కు వెళ్తున్నారు. ఆదివారం రాత్రి 12 గంటలు దాటాక ఒక్కసారిగా వాహనం అంతటా విద్యుత్ సరఫరా జరిగింది. ఏమైందో తెలిసేలోపే కొందరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు.

"వాహనం వెనుక భాగంలో ఉన్న డీజే సిస్టమ్​ జనరేటర్ వైరింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. వ్యాన్​ను సీజ్ చేశాం. కానీ డ్రైవర్ పరారయ్యాడు." అని చెప్పారు మాతాభంగా ఏఎస్​పీ అమిత్ వర్మ.

Last Updated : Aug 1, 2022, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.