ETV Bharat / bharat

'ట్రాన్స్​ఫర్​ ఆర్డర్స్​ రద్దు కోసం మంత్రికి రూ.40 కోట్ల లంచం' - ముంబయి క్రైం వార్తలు

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్ (anil deshmukh news)​ గురించి కీలక విషయాలు వెల్లడించారు సచిన్​ వాజే. అప్పటి కమిషనర్​ పరమ్​ వీర్​ సింగ్​ ఇచ్చిన బదిలీ ఆదేశాలను రద్దు చేసేందుకు డీసీపీల నుంచి రూ.40 కోట్లు తీసుకున్నట్లు తెలిపారు. బార్లు, రెస్టారెంట్ల నుంచి దేశ్​ముఖ్​ తనను డబ్బు వసూలు బాధ్యత కూడా తనకే అప్పగించే వారని పేర్కొన్నారు. మరోవైపు.. దేశ్​ముఖ్​ నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు చేపట్టింది.

anil deshmukh controversy
'ట్రాన్స్​ఫర్​ ఆర్డర్స్​ రద్దు కోసం రూ.40 కోట్ల లంచం'
author img

By

Published : Sep 17, 2021, 2:43 PM IST

మనీలాండరింగ్​ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్ (anil deshmukh news)​ గురించి సంచలన విషయాలు వెల్లడించారు మాజీ పోలీస్​ అధికారి సచిన్​ వాజే. అనిల్​ దేశ్​ముఖ్​, రవాణా శాఖ మంత్రి అనిల్​ పరాబ్​.. 10 మంది పోలీస్​ అధికారుల దగ్గర నుంచి రూ.40 కోట్ల లంచం తీసుకున్నారని తెలిపారు. ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో వాజే (sachin vaze latest news) ఈమేరకు పేర్కొన్నారు.

"2020 జులైలో పరమ్​ వీర్​ సింగ్​ 10 మంది డీసీపీలను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంపై దేశ్​ముఖ్​, పరాబ్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆర్డర్స్​ను రద్దు చేసేందుకు సంబంధిత అధికారుల నుంచి రూ.40 కోట్లు వసూలు చేశారని తెలిసింది. ఇద్దరికీ చెరో రూ. 20 కోట్లను అధికారులు సమర్పించుకున్నారు."

-సచిన్​ వాజే, మాజీ పోలీస్​ అధికారి

'బార్ల నుంచి డబ్బు తెమ్మనేవారు'

బార్లు, రెస్టారెంట్ల నుంచి దేశ్​ముఖ్​ తనను డబ్బు వసూలు చేయమనేవారని ఆరోపించారు వాజే. హై ప్రొఫైల్​ కేసుల దర్యాప్తులో కూడా సూచనలు చేస్తూ ఉండేవారని పేర్కొన్నారు. గతేడాది అక్టోబరులో దేశ్​ముఖ్​.. 1,750 బార్లు, రెస్టారెంట్ల జాబితా ఇచ్చారని తెలిపారు. ఆ జాబితాలోని ప్రతి బార్​, రెస్టారెంట్​ నుంచి రూ.3 లక్షలు వసూలు చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు.

అనిల్​ దేశ్​ముఖ్​ మాజీ కార్యదర్శి సంజీవ్​ పలాండే, సహాయకుడు కుందన్​ శిందేపై ధాఖలైన ఛార్జ్​షీట్​లో భాగంగా ఈడీ సచిన్​ వాజే వాంగ్మూలాన్ని నమోదు చేసింది.

మనీలాండరింగ్ కేసులో సంజీవ్​, శిందేది కీలక పాత్ర అని ఈడీ పేర్కొంది. వాజే ద్వారా అనిల్​ దేశ్​ముఖ్​.. బార్లు, రెస్టారెంట్ల నుంచి వసూలు చేసేవారని తెలిపింది. ఈ క్రమంలో వాజేకు.. అనిల్​ దేశ్​ముఖ్​ చేసే సూచనలను పలాండే చేరవేసేవారని పేర్కొంది. అదే విధంగా వాజే తెచ్చిన డబ్బును శిందే అందుకునేవారని వివరించింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో వాజే.. శిందేకు రూ.4.6 కోట్లు అందించారని తెలిపింది.

ఐటీ దాడులు..

పన్ను ఎగవేతకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ శుక్రవారం.. ముంబయి, నాగ్​పుర్, జైపుర్​లోని దేశ్​ముఖ్​కు చెందిన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది.

ఇదీ కేసు..

అనిల్​ దేశ్​ముఖ్ రూ. 100 కోట్లు లంచం తీసుకున్నారన్న ముంబయి మాజీ పోలీస్​ కమిషనర్​ పరమ్​ వీర్​ సింగ్ ఆరోపణల మేరకు ఈడీ, సీబీఐ దర్యాప్తు చేపట్టాయి. అయితే దీనిపై స్పందించిన అనిల్​.. పరమ్​ వీర్​ సింగ్​ను పదవిలో నుంచి తొలగించాకే ఆయన ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం ఆయన హోంమంత్రి పదవికి రాజీనామా చేశారు.

మరోవైపు సచిన్​ వాజే.. దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్​ అంబానీ ఇంటి వద్ద బాంబుల కేసులో నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసును ఎన్​ఐఏ దర్యాప్తు చేస్తోంది.

ఇదీ చూడండి : 'సూపర్‌ కాప్‌' అవ్వాలని.. అంబానీ నుంచి డబ్బు లాగాలని..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.